ప్రేయసి కోసం కట్టుకున్న భార్యతో కరోనా అని అబద్ధమాడాడు.. అడ్డంగా దొరికాడు!

కరోనా కాలం ఖతర్నాక్‌ పనులు చేసేవాళ్లకు మాబాగా కలిసివస్తోంది... అలాంటి ఓ ఖతర్నాక్‌ కరోనా సాకు చెప్పి ఏం చేశాడంటే భార్యనే వదిలించుకునే పన్నాగం పన్నాడు.. ప్రేమించిన అమ్మాయితో హాయిగా ఉందామనుకున్నాడు..

ప్రేయసి కోసం కట్టుకున్న భార్యతో కరోనా అని అబద్ధమాడాడు.. అడ్డంగా దొరికాడు!
Follow us

|

Updated on: Sep 17, 2020 | 4:26 PM

కరోనా కాలం ఖతర్నాక్‌ పనులు చేసేవాళ్లకు మాబాగా కలిసివస్తోంది… అలాంటి ఓ ఖతర్నాక్‌ కరోనా సాకు చెప్పి ఏం చేశాడంటే భార్యనే వదిలించుకునే పన్నాగం పన్నాడు.. ప్రేమించిన అమ్మాయితో హాయిగా ఉందామనుకున్నాడు.. క్రైమ్‌ సినిమాను తలిపించే ఈ వాస్తవ కథను కాస్త డిటైల్డ్‌గా చెప్పుకుందాం. నవీ ముంబాయిలోని తలోజా ప్రాంతంలో పెళ్లయ్యి సలక్షణమైన భార్య ఉన్న ఓ 28 ఏళ్ల వ్యక్తి ఉండేవాడు.. అతగాడు మనసు మరో పడతిమీదకు మళ్లింది.. ప్రేమ ముదరగానే భార్యను వదిలించేసుకుని ఆమెతో జీవితం గడిపేయాలనుకున్నాడు.. అతగాడికి కరోనా టైమ్‌ కలిసి వచ్చింది.. కొద్ది రోజుల కిందట భార్యకు ఫోన్‌ చేసి తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందనీ, ఎక్కువ రోజులు బతకనని చెప్పేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు.. పాపం అతడి భార్య కంగారుపడింది.. అంతకు మించి ఆందోళన చెందింది.. తన సోదరుడికి విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.. వెంటనే కుటుంబసభ్యులంతా ఆమె పతిదేవుడి కోసం వెతకడం మొదలుపెట్టారు.. ఓ రోజున కుటుంబసభ్యులలో ఒకరికి అతడి బైక్‌ వషీ ప్రాంతంలో కనిపించింది. బండి దగ్గరకు వెళ్లి చూస్తే అది నిందితుడి బండే.. పైగా హెల్మెట్‌, కంపెనీ ఐడీ కార్డు కూడా ఉన్నాయి.. చుట్టుపక్కలంతా వెతికారు.. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని వారు కూడా వెతకడం మొదలు పెట్టారు.. మొబైల్‌ నంబర్‌ ఆధారంగా ట్రాక్‌ చేద్దామనుకున్నారు కానీ ఆ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉండేసరికి ఆ ప్రయత్నం ఫలించలేదు.. పోలీసులు ఒత్తినే వదిలిపెట్టరు కదా! మొత్తం కూపీ లాగారు.. నిశితంగా దర్యాప్తు జరిపితే అతడికి మరో మహిళతో సంబంధం ఉందని తేలింది.. ఆ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.. మొత్తానికి ఇండోర్‌లో ఉన్నట్టు పసిగట్టారు.. అక్కడికి వెళ్లి అతడిని పట్టుకున్నారు. నిందితుడు తన ఊరు పేరు అన్నీ మార్చేసుకుని కొత్త జీవితం గడుపుతున్నాడట అక్కడ! పోలీసులు అతడిని పట్టుకొచ్చి హెచ్చరికలతో కూడిన కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు..