Congress – BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో‌కి టీమిండియా మాజీ క్రికెటర్లు..! ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే?

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. మూడోసారి అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమి మొత్తం 400 లపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పావులుకదుపుతోంది. ఈ దిశగా నేతలు, కార్యకర్తలు శ్రమించాలంటూ ప్రధాని మోదీ ఇటీవలనే దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ పలు రాష్ట్రాల్లో చేరికలపై కూడా దృష్టిసారించింది.

Congress - BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో‌కి టీమిండియా మాజీ క్రికెటర్లు..! ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే?
Bjp Congress

Updated on: Feb 21, 2024 | 12:07 PM

Yuvraj Singh- Navjot Singh Sidhu In Loksabha Elections: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. మూడోసారి అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమి మొత్తం 400 లపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పావులుకదుపుతోంది. ఈ దిశగా నేతలు, కార్యకర్తలు శ్రమించాలంటూ ప్రధాని మోదీ ఇటీవలనే దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ పలు రాష్ట్రాల్లో చేరికలపై కూడా దృష్టిసారించింది. గతంలోపార్టీని వీడిన వారిని.. అంతేకాకుండా పలువురు సెలబ్రెటీలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధంచేసింది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు బీజేపీలో చేరుతారన్న వార్త సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ కాషాయ పార్టీలోకి వస్తారనే ప్రచారంతోపాటు.. యువరాజ్ సింగ్‌ సైతం బీజేపీ లో చేరుతారన్న విషయం సంచలనంగా మారింది. గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్‌ను పోటీకి దింపాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నిరసనల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టినా.. తిరుగుబాటు నేత సిద్ధూ తిరిగి బీజేపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.. ఇప్పటికే.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ సొంతంగా ర్యాలీలు నిర్వహిస్తూ, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడంతోపాటు.. పంజాబ్‌ కాంగ్రెస్ నాయకత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండటం పంజాబ్ రాజకీయాలతోపాటు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది.

ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. సిద్ధూ బీజేపీ చేరే సూచనలు బలంగా ఉన్నాయని బిజెపి అధికారి సోమ్‌దేవ్ శర్మ అన్నారు. “అతని చేరికపై అంచనాతో ఇతర బిజెపి నాయకులు, అభ్యర్థులతో చర్చలు జరుగుతున్నాయి. అయితే వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు” అని ఆయన చెప్పారు. అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉన్నందున, ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి గెలుపు ఖాయమని సిద్ధూను ఆ స్థానం నుంచి బరిలోకి దించవచ్చని శర్మ చెప్పారు.

గురుదాస్‌పూర్‌లో ప్రస్తుత ఎంపీ సన్నీడియోల్ స్థానంలో యువరాజ్ సింగ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన విషయం తెలిసిందే. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ వ్యక్తులను పోటీకి దింపిన చరిత్ర కాషాయ పార్టీకి ఉంది. గతంలో నటుడు వినోద్ ఖన్నా ఈ నియోజకవర్గం నుంచి రెండు దఫాలు ఎంపీగా గెలిచారు.

కాగా..సిద్ధూ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు సన్నిహితుడిగా ఉన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆయన తిరిగి బిజెపిలో చేరచ్చని పేర్కొంటున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టిక్కెట్ ఆఫర్ చేసిందని.. మాజా ప్రాంతంలోని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించడంతోపాటు.. అదేం లేదంటూ కొట్టిపారేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..