Watch Video: ఓర్నీ రీల్స్‌ పిచ్చి తగలెయ్యా.. ఎలుగుబంటికి కూల్‌డ్రింక్‌ ఇచ్చేందుకు వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. అవి చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఒక యువకుడు రీల్‌ కోసం ఏకంగా ఎలుగుబంటితోనే సవాసం చేశాడు. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం పదండి.

Watch Video: ఓర్నీ రీల్స్‌ పిచ్చి తగలెయ్యా.. ఎలుగుబంటికి కూల్‌డ్రింక్‌ ఇచ్చేందుకు వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే
Viral Video

Updated on: Sep 14, 2025 | 10:02 PM

జంతువులు చేసి చిలిపి చేష్టలు, అల్లరి పనులతో ఎప్పటికప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆలానే జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియోనే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక యువకుడు సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం ఏకంగా ఎలుగుబంటితోనే సావాసం చేశాడు. నారా గ్రామంలోని వన్యప్రాణుల కేంద్రంలో ఉన్న ఒక ఎలుగుబంటి దగ్గరకు వెళ్లిన యువకుడు దానికి కూల్‌ డ్రింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దానికి దగ్గరగా వెళ్లి దాని ముందు కూల్‌డ్రింక్‌ బాటిల్‌ పెట్టాడు. అది దగ్గరకు రావడం గమనించి అక్కడి నుంచి దూరంగా వచ్చేశాడు. వెంటనే అక్కడి వచ్చిన ఎలుగుబంటి ఆ బాటిల్‌ తీసుకుని అందులో ఉన్న డ్రింక్‌ తాగింది.  ఈ ఘటన చత్తీస్‌గడ్‌ జిల్లాలో జరిగింది.

అయితే అతను ఎలుగుబంటికి కూల్‌డ్రింగ్ ఇచ్చిన వీడియోను అతను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్‌ పిచ్చితో జంతువులతో సావాసం ఏంటని మండిపడ్డారు. అవి క్రూర మృగాలని కొన్ని సార్లు దాడి చేసి ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ వీడియోపై అటవీశాఖ అధికారులు కూడా స్పందించారు. రీల్‌ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.