ఇదేం పిచ్చి ప‌ని.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. అత‌డు పురుషాంగం కోసేసుకున్నాడు..

|

Jun 30, 2021 | 1:59 PM

పెళ్లి విష‌యంలో ఒక్కొక్క‌రి ఒక్కో ర‌క‌మైన అభిప్రాయం ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామ‌ని కొంద‌రు.. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామ‌ని మ‌రికొంద‌రు...

ఇదేం పిచ్చి ప‌ని.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. అత‌డు పురుషాంగం కోసేసుకున్నాడు..
Man Cuts His Penis
Follow us on

పెళ్లి విష‌యంలో ఒక్కొక్క‌రి ఒక్కో ర‌క‌మైన అభిప్రాయం ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామ‌ని కొంద‌రు.. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామ‌ని మ‌రికొంద‌రు అనుకుంటారు. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల‌తో అభిప్రాయ బేధాలు వ‌స్తాయి. అలాంటప్పుడు కూర్చుని మాట్లాడుకోని స‌మ‌స్య‌ను పరిష్కరించుకోవాల‌ని కానీ విప‌రీత నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు. తాజాగా చెన్నైలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు ఎవ్వరూ ఊహించని పని చేశాడు. ఉలితో త‌న పురుషాంగం క‌ట్ చేసుకున్నాడు.

వివ‌రాల్లోకి వెళ్తే… చెన్నై గాంధీ నగర్‌కు చెందిన మురుగన్ కుమారుడు 23 ఏళ్ల విజయరాఘవన్‌కు పెళ్లి చేయాలని అతడి పేరెంట్స్ నిర్ణయించారు. అయితే తనకు రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అత‌డు వారికి చెప్పాడు. అయినా వినకుండా కుటుంబ స‌భ్యులు అతనికి ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. పెళ్లి వద్దు అని ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు విన‌క‌పోవ‌డంతో ఆ యువకుడు ఊహించ‌ని ప‌నికి పూనుకున్నాడు. బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఉలితో పురుషాంగాన్ని కోసుకున్నాడు. తను ఇక పెళ్లికి పనికిరానంటూ గ‌ట్టిగా కేక‌లేశాడు. తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు సేలం జిల్లాలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాగా అత‌డి నుంచి ఉలిని లాక్కునే క్ర‌మంలో గొంతుకు తగలడంతో అక్కడా తీవ్రంగా గాయమైంది. చికిత్స కొనసాగుతుంది.

Also Read:  పొలిటిక‌ల్ డైలాగ్స్ పేల్చిన వైయ‌స్. ష‌ర్మిల‌.. రేవంత్ రెడ్డిపై కూడా అటాక్

: తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బ‌దులిచ్చిన ఏపీ మంత్రి బొత్స‌