అతిసారంతో అవస్థలు పడుతున్న యువకుడు.. యూట్యూబ్‌ చూసి సొంత వైద్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Aug 28, 2023 | 4:25 PM

జిల్లా వ్యాప్తంగా అతిసారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర విరేచనాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఓ యువకుడు యూట్యూబ్​ చూసి విరేచనాలకు సొంత వైద్యం చేసుకున్నాడు. అతిసారం తగ్గేందుకు యూట్యూబ్​లో సూచించిన విధంగా 10 కర్పూరం బిళ్లలు మింగాడు.. దాంతో అతని ఆరోగ్యం విషమించింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్నిహుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ,

అతిసారంతో అవస్థలు పడుతున్న యువకుడు.. యూట్యూబ్‌ చూసి సొంత వైద్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Self Treatment For Diarrhoe
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా, ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి మారుమూల పల్లెలు, గ్రామాల్లో కూడా ఇప్పుడు ఇంటర్ నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. దీంతో ప్రజలు చాలా సమస్యలకు సొంతంగానే పరిష్కరించుకుంటున్నారు. అందులో భాగంగా ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు కూడా సోషల్ మీడియా సమాచారం సొంత వైద్యం చేసుకుంటున్నారు. అలాగే యూట్యూబ్ చూసి సొంత వైద్యం ప్రయత్నించిన ఓ వ్యక్తి వైద్యం వికటించి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరాడు.

జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం కారణంగా ప్రజలు చాలా మంది మరణిస్తున్నారు. గిరిజనులు అధికంగా ఉండే కొండ ప్రాంతాలు దీని వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి..మెరుగైన వైద్యం కోసం సదర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో కూడా అతిసారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర విరేచనాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఓ యువకుడు యూట్యూబ్​ చూసి విరేచనాలకు సొంత వైద్యం చేసుకున్నాడు. అతిసారం తగ్గేందుకు యూట్యూబ్​లో సూచించిన విధంగా 10 కర్పూరం బిళ్లలు మింగాడు.. దాంతో అతని ఆరోగ్యం విషమించింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్నిహుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

లాతేహార్‌ జిల్లాలోని బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామానికి చెందిన అవధేశ్​ కుమార్ సాహు గత నాలుగైదు రోజులుగా డయేరియాతో అవస్థ పడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లలేక.. యూట్యూబ్​లో చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. యూట్యూబ్‌ చూసి ఇంట్లోనే డయోరియా తగ్గేందుకు కర్పూరం బిల్లాలు మింగాడు. యూట్యూబ్‌లో చెప్పినట్టుగా అతడు ఒకేసారి 10 కర్పూరం మాత్రలను మింగాడు. అసలే విరేచనాలతో నిరసించిపోయాడు.. కర్పూరం బిల్లలు మింగటంతో అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారంది. అవధేశ్​ పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ బాధితుడికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి వైద్యులు అవధేశ్‌ ప్రయత్నించిన ఇంటి వైద్యం వివరాలు చెప్పారు. యూట్యూబ్ ద్వారా సొంత చికిత్సను ప్రయత్నించాడని చెప్పారు. దాంతో చికిత్స చేసిన డాక్టర్‌.. అతడి పరిస్థితి కుదుట పడినట్టుగా చెప్పాడు. అతనిలో కర్పూరం ప్రభావం ఇంకా ఉందన్నారు.. అందుకే ఆ యువకుడు కనీసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. యూట్యూబ్​ లాంటి సోషల్​ మీడియాల్లో సూచించే చిట్కాలు​ అనుసరిస్తూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్‌ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..