గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీకి కొత్త రూల్.. ఇక నుంచి ఓటీపీ తప్పనిసరి.!

గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో కొత్త మార్పులు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుంచి సరికొత్త విధానాన్ని ఆయిల్ కంపెనీలు..

గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీకి  కొత్త రూల్.. ఇక నుంచి ఓటీపీ తప్పనిసరి.!
Follow us

|

Updated on: Oct 16, 2020 | 8:22 PM

గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుంచి సరికొత్త విధానాన్ని ఆయిల్ కంపెనీలు అమలులోకి తీసుకొస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఇవ్వాల్సి ఉంటుంది. పాత విధానంలో చాలామంది గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండటంతో ఈ ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. (OTP for delivery of LPG cylinder)

ఈ డెలివరీ అటెంటికేషన్ కోడ్(డీఏసీ) విధానాన్ని తొలుత 100 స్మార్ట్ సిటీలలో నవంబర్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని కంపెనీలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని విస్తరించనున్నారు. గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునేవారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి.. వినియోగదారుడు ఆ ఓటీపీ నెంబర్‌ను చూపించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతీ గ్యాస్ కనెక్షన్‌దారుడు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అలా లేనిపక్షంలో డెలివరీ సాధ్యపడదని స్పష్టం చేసింది. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే ఈ విధానం వర్తించనుంది. కమర్షియల్ సిలిందర్లకు వర్తించదు.