Ampere Nexus: ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్.. రూ.1.10 లక్షలకే సూపర్ ఫీచర్స్‌తో లాంచ్

ప్రముఖ కంపెనీ ఆంపియర్ తన కొత్త ప్రీమియం స్కూటర్లు నెక్సస్ ఈఎక్స్, నెక్సస్ ఎస్‌టీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్లు భారతదేశంలోని బ్రాండ్ మోడల్ లైనప్‌లో అగ్రస్థానంలో ఉంటాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే నెక్సస్ ఈఎస్ రూ. 1.20 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విక్రయించబడుతుంది. అయితే బ్రాండ్ దీనిని రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందిస్తోంది.

Ampere Nexus: ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్.. రూ.1.10 లక్షలకే సూపర్ ఫీచర్స్‌తో లాంచ్
Ampere Nexus
Follow us

|

Updated on: May 02, 2024 | 4:00 PM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ఆంపియర్ తన కొత్త ప్రీమియం స్కూటర్లు నెక్సస్ ఈఎక్స్, నెక్సస్ ఎస్‌టీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్లు భారతదేశంలోని బ్రాండ్ మోడల్ లైనప్‌లో అగ్రస్థానంలో ఉంటాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే నెక్సస్ ఈఎస్ రూ. 1.20 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విక్రయించబడుతుంది. అయితే బ్రాండ్ దీనిని రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందిస్తోంది. అదేవిధంగా నెక్సస్ ఎస్‌టీ రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద విక్రయించబడుతుంది, అయితే ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే ఈ రెండు స్కూటర్ల ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆంపియర్ నెక్సస్ స్కూటర్లు ఆధునిక డిజైన్‌తో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ స్కూటర్ ఫ్రంట్ ఎండ్ ఒక ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్‌ను కోణీయ డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ ఫోర్‌బోర్డ్‌లో మంచి స్థలంతో మంచి సిటింగ్ స్థలాన్ని అందిస్తుంది. 1,319 ఎంఎం వీల్ బేస్‌తో వచ్చే ఈ స్కూటర్ 712 ఎంఎం సీటు పొడవుతో 235 ఎంఎం ఫ్లోర్‌బోర్డ్ స్థలంతో వస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది

ఆంపియర్ నెక్సస్ ఎస్‌టీ వెర్షన్‌లో 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తుంది. అయితే ఈఎక్స్ 6.2 అంగుళాల పీఎంవీఏ ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ ఐదు రైడింగ్ మోడ్లను కూడా అందిస్తుంది. ఎకో, సిటీ, పవర్, లింప్ హెూమ్, రివర్స్ మోడ్‌తో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో వస్తుంది. అలాగే వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డిస్క్ బ్రేక్‌తో పాటు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. ముఖ్యంగా ఆంపియర్ నెక్సస్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా  136 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బ్యాటరీని 15ఏ ఛార్జర్ ఉపయోగించి 3.3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. బ్రాండ్ 25 ఏ ఫాస్ట్ ఛార్జర్ ఎంపికను కూడా అందిస్తోంది. బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌పై  ఆధారపడి 3.3 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు లేదా 4.0 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..