అరుదైన జాతికి చెందిన తాబేలు…బంగారు వర్ణంతో ఇలా..!

సాధారణంగా కనిపించే అన్ని తాబేళ్లు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఇక నక్షత్ర తాబేళ్లను కూడా మనం చూస్తుంటాం. కానీ, అక్కడ మాత్రం అరుదైన తాబేలు ప్రత్యక్షమైంది...

అరుదైన జాతికి చెందిన తాబేలు...బంగారు వర్ణంతో ఇలా..!

Updated on: Jul 20, 2020 | 3:29 PM

సాధారణంగా కనిపించే అన్ని తాబేళ్లు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఇక నక్షత్ర తాబేళ్లను కూడా మనం చూస్తుంటాం. కానీ, అక్కడ మాత్రం అరుదైన తాబేలు ప్రత్యక్షమైంది. ప‌సుపు వ‌ర్ణంలో క‌నిపించిన తాబేలును చూసిన స్థానికులు ఆశ్చ‌ర్య‌ం వ్యక్తం చేస్తున్నారు. పసుపు పూసినట్టుగా, బంగారు వ‌ర్ణంలో మెరిసిపోతూ కనిపించింది. ఆ అరుదైన తాబేలు ఒడిశా రాష్ట్రంలో కనిపించింది.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సుజన్ పూర్ గ్రామంలో ఈ వింత తాబేలు కనిపించింది. బంగారం పూత పూసినట్లు ఉన్న ఈ తాబేలు వెలుతురులో మెరిసిపోతూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దానిని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. పసుపు రంగుతో మెరుస్తూ కనిపించిన తాబేలును చూసి… వైల్డ్ లైఫ్ వార్డెన్ భానుమిత్ర ఆచార్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ పసుపు రంగులో ఉండి వెలుతురులో మెరిసే తాబేలును ఎక్కడా చూడలేదని చెప్పారు. ఇవీ చాలా అరుదైన జాతికి చెందినవిగా అభిప్రాయపడ్డారు.