World’s Largest Elevator: ప్రపంచంలోనే పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్‌ ఇండియాలోనే.. ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు

|

May 24, 2022 | 1:01 PM

World's Largest Elevator: టెక్నాలజీ మరింతగా పెరిగిపోతోంది. సాధారణ లిఫ్ట్‌లు పది మందిలోపు మాత్రమే మోయగల సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏర్పాటు చేసిన లిప్ట్‌లో..

Worlds Largest Elevator: ప్రపంచంలోనే పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్‌ ఇండియాలోనే.. ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు
Follow us on

World’s Largest Elevator: టెక్నాలజీ మరింతగా పెరిగిపోతోంది. సాధారణ లిఫ్ట్‌లు పది మందిలోపు మాత్రమే మోయగల సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏర్పాటు చేసిన లిప్ట్‌లో సుమారు 200 మంది వరకు మోసే సామర్థ్యం ఉంది. ముంబయిలోని బీకేసీ జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ముంబాయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్టుగా కోన్ ఎలివేటర్స్ ఇండియా కంపెనీ వెల్లడించింది. ఈ ఎలివేటర్‌ ఒకేసారి 200 మంది మోయగల సామర్థ్యం ఉంటుంది. 5-స్టాప్‌, 16 టన్నుల ఎలివేటర్‌ 25.78 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది.

నాణ్యత, భద్రత ప్రమాణాలతో దీనిని ఏర్పాటు చేసినట్లు కోన్‌ ఎలివేటర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ గోస్సెయిన్‌ తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎలివేటర్ ధరను వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. జియో వరల్డ్ సెంటర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 188 ఎలివేటర్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేసినట్లు గోస్సెయిన్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సేన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ కోన్ ద్వారా ఉందని, అది భారతదేశంలోనే ఉన్న విషయాన్ని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. భారత్‌లోని మా బృందంతో పాటు, కోన్ గ్లోబల్‌లోని ప్రధాన ప్రాజెక్ట్‌ల నిపుణుల బృందం సంక్లిష్టమైన ప్రాజెక్ట్‌ను రూపొందించించిందని అన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి