
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరిచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకొని నీటిని తోడుకోవాల్సి వస్తుంది. అయితే బావిలో కూడా నీరు అడుగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపితే కాని తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. బావి లోపలికి దిగే క్రమంలో కొద్దిగా అదుపుతప్పినా సదరు మహిళకు ప్రమాదం తప్పదు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియోలో ఒక మహిళ తెగిపోతున్న ఒక తాడును పట్టుకుని, ఎండిపోయిన, పాడుబడిన బావిలోకి నెమ్మదిగా దిగుతుంది. ఆమె పాదాలు దాని లోపలి గోడ వెంట పొదిగిన అసమాన రాళ్లపై జాగ్రత్తగా పెట్టుకుంటూ అతి కష్టం మీద కిందకు దిగుతోంది. ఆ బావి చుట్టూరా నీళ్ల కోసం వచ్చిన మహిళలు, గ్రామస్తులు ఆందోళనగా చూస్తున్నారు. వారిలో కొంత మంది మగవారు కూడా ఉన్నారు. అందరూ భయానక నిశ్శబ్దంతో చూస్తున్నారు. ప్రతి ఒక్కరి గుండె భయంతో కొట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కళ్ళు బావిలోకి దిగుతున్న మహిళ పాదాల వైపు చూస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే బోరిచివారిలో కూడా మహిళలు తమ రోజు వారి అవసరాల కోసం నీటిని వెతుక్కుంటూ, మైళ్ల కొద్దీ నడిచి, మండుతున్న ఎండలో గంటల తరబడి నిలబడి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రతి యేటా మహారాష్ట్రాలో వేగంగా కనుమరుగవుతున్న నీటి వనరు ప్రతి చుక్కను తిరిగి పొందడానికి అక్కడి ప్రజలు ఇలాంటివి ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, తమ రోజును ప్రారంభిస్తారు. ముగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..