Mysuru: భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం.. చివరకు

పెళ్లయినప్పటికీ, గతంలో ఆమె ప్రియునితో కలసి వెళ్లిపోయింది. అయితే పెద్దలు రాజీ పంచాయతీ చేసి మళ్లీ భర్తకు అప్పగించారు. కానీ ఆమె మైండ్ సెట్ మారలేదు.

Mysuru: భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం.. చివరకు
Wife Kills Husband

Updated on: Feb 16, 2023 | 11:30 AM

వారిద్దరూ.. వారికిద్దరూ.. ఎంతో అందమైన ఫ్యామిలీ. చీకూ చింత లేని జీవితం. కానీ దిక్కుమాలిన వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తన సంబధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఏకంగా భర్తనే చంపింది ఈ టక్కులాడి. మైసూర్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. మృతుడిని హోటగళ్లి నివాసి మంజు అని తెలిపారు పోలీసులు.

వివారాల్లోకి వెళ్తే…  మైసూరు బోగాది నివాసి లిఖితతో 12 ఏళ్ల క్రితం మంజుకు మ్యారేజ్ అయ్యింది. వీరికి ఇద్దరు తనయులు ఉన్నారు. వివాహం అయి పిల్లలు పుట్టాక కూడా, గతంలో ఆమె ప్రియునితో కలసి జంప్ అయ్యింది. అయితే పెద్దలు నచ్చ చెప్పి… రాజీ కుదిర్చి.. మళ్లీ చేసి మళ్లీ భర్త వద్దకు పంపారు. అయినప్పటికీ భార్య ప్రవర్తన మారలేదు. ఇదే విషయంపై దంపతుల మధ్య నిత్యం గొడవలు అవుతూ ఉండేవి.

భర్త ఉంటే తమ వ్యవహారం సాఫీగా సాగదని.. నిర్ధారించుకున్న భార్య, ప్రియుడు కలిసి హత్యకు కుట్ర చేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజును ఇద్దరూ గొంతు పిసికి చంపేశారు. బుధవారం ఉదయం అనారోగ్యంతో చనిపోయాడని నంగనాశి భార్య శోకాలు పెట్టింది.  ఈవిడగారి గత జిమ్మిక్కులు తెలియడంతో.. విజయనగర పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో.. అసలు విషయం వెలుగుచూసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం