ట్యాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉందో ఎవరూ ఊహించలేరు. అయితే కళను ప్రదర్శించడంలో స్ర్రీ పురుషులెవరూ అతీతం కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేసేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ట్యాటెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహరాష్ట్రలోని ఒక మహిళ కర్రసాము చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గిరగిరా కర్ర తిప్పుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఆమె చేస్తున్న విన్యాసాన్ని నెటిజన్లు కళ్లార్పకుండా వీక్షించారు. అంతే కాదు కత్తి, డాలు పట్టుకొని కదనరంగంలో ఝాన్సీ లక్ష్మీబాయిని తలపించేలా కత్తి సాము చేసింది. ఆమె ఎనర్జీ లెవెల్స్‌కి నెటిజన్లు షాకవుతున్నారు. సరిలేరు నీకెవ్వరూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.
Also Read