Watch: ఛీ..ఛీ.. కోడలు కాదు.. కాలకేయి.. మామను దారుణంగా కొట్టిన కోడలు.. వీడియో

|

Mar 13, 2024 | 2:11 PM

చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.. మానవత్వాన్ని మరిచి మరి పాశవికంగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ కోల్పోయి.. మృగాల్లా మారుతున్నారు.. తాజాగా.. మామపై కోడలు పాశవికంగా దాడి చేసి కొట్టింది.. వృద్ధుడు అని చూడకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఇదంతా.. కేవలం సోఫా మీ షర్ట్ పెట్టాడన్న కారణంతో 87 ఏళ్ల వృద్ధుడిని వాకింగ్ స్టిక్ తో చావబాదింది.

Watch: ఛీ..ఛీ.. కోడలు కాదు.. కాలకేయి.. మామను దారుణంగా కొట్టిన కోడలు.. వీడియో
Crime News
Follow us on

చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.. మానవత్వాన్ని మరిచి మరి పాశవికంగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ కోల్పోయి.. మృగాల్లా మారుతున్నారు.. తాజాగా.. మామపై కోడలు పాశవికంగా దాడి చేసి కొట్టింది.. వృద్ధుడు అని చూడకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఇదంతా.. కేవలం సోఫా మీ షర్ట్ పెట్టాడన్న కారణంతో 87 ఏళ్ల వృద్ధుడిని వాకింగ్ స్టిక్ తో చావబాదింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. కర్ణాటక బెంగళూరుకి చెందిన ఓ కోడలు వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదిందని.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి కూతురు ఫిర్యాదు ఆధారంగా మామపై దాడి చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగుళూరుకి చెందిన పద్మనాభ సువర్ణ (87) అనే వృద్ధుడు కుల్‌శేఖర్ ఏరియాలో నివాసముంటున్నాడు. పద్మనాభ కుమారుడు విదేశాల్లో ఉంటుండగా.. తన కోడలు ఉమా శంకరితో కలిసి అతను మంగుళూరులో ఉంటున్నాడు. వాకింగ్ స్టిక్ సహాయంతో అతను తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మామ పద్మనాభ సువర్ణ.. సోఫా మీద షర్ట్ ఉంచాడన్న కారణంతో కోడలు చేతి కర్రతో అతనిపై దారుణంగా దాడి చేసింది. కర్రతో పలుమార్లు దాడి చేసి గాయపరిచింది.

వీడియో చూడండి..

వృద్ధుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కోడలు ఉమా శంకరిని అరెస్టు చేశారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమా శంకరి అట్టవార్‌లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన మార్చి 9న శనివారం జరిగింది.

కాగా.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. ఈ దారుణానికి సంబంధించిన వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేసి.. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..