
ఇస్లామాబాద్, మే 4: కాశ్మీర్‌లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దాదాపు ముగిసిపోయాయి. ఇరు దేశాల మధ్య మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ఇప్పటికే శబధం చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్‌పై అనేక దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. మరోవైపు భారత్ దాడి చేస్తుందనే భయం పాకిస్తాన్‌లో అణువణువునా కనిపిస్తుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఒక వేళ యుద్ధమే వస్తే దేశం వదిలి పారిపోతామని ఏకంగా పాకిస్తాన్ రాజకీయ నాయకులే బహిరంగంగా అంటున్నారు. ఇస్లామాబాద్ నేత షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ స్థానిక విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
‘భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీతో సరిహద్దుకు వెళ్తారా?’ అని అక్కడి విలేకరి ప్రశ్నించగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ సమాధానమిస్తూ.. ‘భారత్‌తో యుద్ధం జరిగితే, నేను ఇంగ్లాండ్ పారిపోతాను’ అని బదులిచ్చాడు. మార్వాట్ ఇచ్చిన సమాధానంలో ఆశ్చర్యానికి గురైన మరో జర్నలిస్ట్.. ‘ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తగ్గాలని మీరు కోరుకుంటున్నారా..? అని మరో ప్రశ్న సంధించాడు. ఇందుకు మార్వాట్ బదులిస్తూ.. ‘నేను చెప్పినంత మాత్రాన మాటను వెనక్కి తీసుకునేందుకు మోదీ ఏమైనా నా పిన్ని కొడుకా? నేను చెబితే వెనక్కి వెళ్లడానికి.. (మోడీ మేరీ ఖలా కా బేటా హే క్యా..)’ అంటూ పేర్కొన్నారు. దీంతో పాక్ ఎంపీ మార్వాట్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా తమ సైన్యాన్ని నమ్మే స్థితిలో లేరని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. పైగా భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయం పాకిస్తాన్ రాజకీయ నేతల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే భారత్‌పై దాడి చేసే దమ్ము, ధైర్యం పాక్‌కు ఏమాత్రం ఉందో తెలిసిపోతుందని అంటున్నారు.
Pakistaniyon ki fat ke char ho gayi hai🧵
Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiye
Sher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂
Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1
— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యుడు మార్వాత్. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సొంత పార్టీ, దాని నాయకత్వంపై తరచూ మార్వాత్ విమర్శలు చేస్తుండటంతో ఇమ్రాన్ ఖాన్ ఆయనను కీలక పదవుల నుంచి తొలగించారు.
కాగా ఏప్రిల్ 22న పహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ గడ్డి మైదానాల వద్ద ముగ్గురు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపడంతో 28 మంది మృతి చెందారు. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి వస్తువుల దిగుమతిని భారత్ శనివారం (మే 3) నిషేధించింది. పాకిస్తాన్ నౌకలు భారత ఓడరేవులలోకి ప్రవేశించకుండా నిరోధించింది. 1960లో పాక్‌తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత జెండా ఉన్న ఏ నౌకలను తమ ఓడరేవుల్లోకి అనుమతించబోమని పాకిస్తాన్ శనివారం రాత్రి ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.