ఎంపీల సస్పెన్షన్ లను రద్దు చేసేంతవరకు ‘సభ’ బాయ్ కాట్, గులాం నబీ ఆజాద్

ఎనిమిది మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్  ఎత్తివేసేంతవరకు రాజ్యసభ కార్యకలాపాలను బాయ్ కాట్ చేస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం సభలో ప్రకటించారు.

ఎంపీల సస్పెన్షన్ లను రద్దు  చేసేంతవరకు సభ బాయ్ కాట్, గులాం నబీ ఆజాద్

Edited By:

Updated on: Sep 22, 2020 | 10:53 AM

ఎనిమిది మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్  ఎత్తివేసేంతవరకు రాజ్యసభ కార్యకలాపాలను బాయ్ కాట్ చేస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం సభలో ప్రకటించారు. జీరో అవర్ లో మాట్లాడిన ఆయన, వారి సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుధర కన్నా తక్కువ ధరకు రైతుల నుంచి ప్రైవేటు వ్యక్తులు ఆహార ధాన్యాలను కొనకుండా చూడాలని, ఇందుకు వేరుగా బిల్లు తేవాలని ఆజాద్ కోరారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించాలని ఆయన సూచించారు.