No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..

No Internet: ఇంటర్నెట్ కొన్ని నిమిషాలు రాకపోతేనే ప్రపంచం అతలాకుతలం అవుతుంది. అలాంటిది ఏకంగా ఈ అంతరాయం 8 రోజులు కొనసాగటం అంటే మామూలు విషయం కాదు.

No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ఇంటర్నెట్ సేవలు బంద్.. కారణమేంటంటే..
Ban On Internet

Updated on: Mar 06, 2022 | 2:52 PM

No Internet: ఇంటర్నెట్ కొన్ని నిమిషాలు రాకపోతేనే ప్రపంచం అతలాకుతలం అవుతుంది. అలాంటిది ఏకంగా ఈ అంతరాయం 8 రోజులు కొనసాగటం అంటే మామూలు విషయం కాదు. పశ్చిమ బెంగాల్(West Bengal) లో రోజు కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ సేవలు(Internet Services) అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో జరగనున్న మాధ్యమిక పరీక్షలే ఇందుకు కారణం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రోజూ కొంత సమయం పాటు అంతర్జాలసేవలు ప్రజలకు అందుబాటులో ఉండవని పశ్చిమ బెంగాల్ అదనపు చీఫ్ సెక్రెటరీ వెల్లడించారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్‌బెహార్, జల్‌పైగురి, బీర్భూమ్, డార్జిలింగ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

పైన పేర్కొన్న ప్రాంతాల్లో మార్చి 7-9, మార్చి 11 -12, మార్చి 14-16 తేదీల్లో.. 11 AM- 3:15 PM మధ్య మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఎందుకంటే.. ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనీని కొన్ని ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు రాబోయే కొద్ది రోజుల్లో ఉపయోగించబడవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని.. ఆ సమాచారాన్ని పరిశీలించిన తరువాత అంటువంటి వాటిని నిలువరించటంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చదవండి..

Mahesh Babu: సూపర్‌ స్టార్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పిన రోజా.. ఉబ్బితబ్బిబ్బైపోతోన్న మహేశ్‌ ఫ్యాన్స్..

Chicken Price: బాబోయ్‌.. ఈ చికెన్ చిక్కనంటోంది.. కోడి ధర తగ్గనంటోంది.. కారణం ఇదే!