Mamata Benarjee Fire on BJP: భారతీయ జనతా పార్టీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Union Government).. పశ్చిమ బెంగాల్(West Bengal)లోని తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అడిగిన కొన్ని ప్రశ్నలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సమాధానమిచ్చారు. అంతకు ముందు యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎలాంటి విద్యాపరమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాలని బెంగాల్ సీఎం మమత కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల పూర్తి సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ, ఉక్రెయిన్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన పిల్లల కోసం ప్రభుత్వం చేసిన ప్రణాళికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన 17 వేల మంది భారతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రధానిని కోరతానని మమతా బెనర్జీ అన్నారు. వారి చదువు ఏమవుతుంది? ఈ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపడం ప్రభుత్వ కర్తవ్యం కాదా? అని మమతా ప్రశ్నించారు.
మమతా బెనర్జీపై బెంగాల్ భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర తప్పుబట్టారు. ముఖ్యమంత్రి మమతా తన పరిమితిని దాటి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని రెచ్చగొడుతోందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కూడా ఊహకందనిదని సువెందు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పదాలు భారతదేశానికి వ్యతిరేకంగా దౌత్యపరంగా ఉపయోగించవచ్చని వారికి తెలియదా? దీనివల్ల మన విదేశాంగ విధానం, అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన ట్వీట్ చేశారు.
Unimaginable !!!
Hon’ble CM @MamataOfficial exceeded her limit yesterday & accused the Centre of stoking war between Russia and Ukraine.
Isn’t she aware that these words could be used against India diplomatically? Our Foreign Policy & International Relations might get impacted.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 30, 2022
ఇదిలావుంటే, బెంగాల్ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువులో సహాయం చేయడానికి బెంగాల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బెనర్జీ చెప్పారు. బెంగాల్‌కు తిరిగి వచ్చిన 400 మంది విద్యార్థులను ఆమె కలుసుకున్నారు. ఆ పిల్లల చదువుకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఉచిత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.
Read Also…. AP High Court: నేర చరితులకు టీటీడీ పదవులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు!