Watch Video: ఆస్పత్రిలో AC గదిలో డాక్టర్‌ బాబు మొద్దు నిద్ర.. తీవ్ర రక్తస్రావంతో వ్యక్తి మృతి! వీడియో వైరల్

ఓ వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ విధులను మరచి.. ఏంచక్కా ఏసీ గదిలో కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాడు. అంతలో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తిని కొందరు తీసుకువచ్చారు. వెంటనే వైద్యం చేయమని కాళ్లావేళ్లాపడినా సదరు వైద్యుడు మాత్రం కదలలేదు. పైగా టేబుల్‌పై రెండు కాళ్లు పెట్టి చక్కగా నిద్రపోతున్నాడు. అతడి పక్కనే స్ర్టెచర్‌పై బాధితుడు తెల్లవారులు రక్తమోడుతూనే ఉండటంతో పరిస్థితి విషమించి మరుసటి రోజు ఉదయం ప్రాణాలు వదిలాడు. వైద్యుడి నిర్లక్ష్యం మూలంగా సమయానికి వైద్యం అందకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ మీరఠ్‌లో సోమవారం (జులై 28) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Watch Video: ఆస్పత్రిలో AC గదిలో డాక్టర్‌ బాబు మొద్దు నిద్ర.. తీవ్ర రక్తస్రావంతో వ్యక్తి మృతి! వీడియో వైరల్
Patient Bleeds To Death In Meerut Hospital

Updated on: Jul 29, 2025 | 5:14 PM

పుణె, జులై 29: ఉత్తరప్రదేశ్‌ మీరఠ్‌లో సోమవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో సునీల్‌ (30) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని లాలా లజపతిరాయ్‌ మెమోరియల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న ఇద్దరు జూనియర్‌ డాక్టర్లను ఎంత వేడుకున్నా నిర్లక్ష్యంగా నిద్రపోవడంతో పరిస్థితి విషమించి సునీల్‌ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాధితుడు అత్యవసర వార్డులో స్ట్రెచర్‌పై పడి ఉన్నట్లు, తీవ్ర రక్తస్రావం అవుతున్నట్లు కనిపించడం వీడియో ఫుటేజీలో చూడొచ్చు. వీడియోలో కుర్చీలో కూర్చుని జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ నిద్రపోతున్నట్లు కనిపించింది.

వీడియోలో ఓ వైద్యుడు ఎయిర్ కండిషనర్ ముందు కాళ్లు టేబుల్ మీద పెట్టుకుని నిద్రపోవడం కూడా కనిపిస్తుంది. నిద్ర పోతున్న డాక్టర్‌ ముందు ప్రిస్క్రిప్షన్ పట్టుకుని అతన్ని మేల్కొలపడానికి ప్రయత్నిస్తుంది. అతడి సమీపంలోనే కాలు నుంచి రక్తం కారుతూ బాధతో విలవిలలాడుతున్న సునీల్‌ వీడియోలో కనిపిస్తాడు. గంటల తరబడి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్ట్రెచర్‌పై నొప్పితో, రక్తస్రావంతో అల్లడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై లాలా లజపతిరాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్‌చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత తాను తిరిగి వెళ్లి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, కాస్ట్ ఇచ్చానని చెప్పాడు. అయితే, మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సునీల్ మరణించాడు. రోగిని తీసుకువచ్చినప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ జిందాల్ కొత్త నాటకం మొదలు పెట్టాడు. LLRM మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ RC గుప్తా సదరు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్‌ చేశాడు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌ను వివరణాత్మక విచారణ నిర్వహించాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.