Watch Video: డ్రగ్స్‌ మత్తులో.. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం! చితకబాదిన తోటి ప్రయాణికులు

|

Sep 22, 2023 | 9:32 AM

గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయానికుడు చేసిన పనికి ప్రయాణికులు భయంతో కంగారుపడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపవల్సి వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ ప్రయాణికుడు గాలిలోనే విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గురువారం (సెప్టెంబర్ 21) ఇండిగో విమానం అగర్తలలోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో దిగడానికి 10 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి..

Watch Video: డ్రగ్స్‌ మత్తులో.. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం! చితకబాదిన తోటి ప్రయాణికులు
Passenger Tries To Open Indigo Flight Emergency Door
Follow us on

అగర్తలా, సెప్టెంబర్ 22: గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయానికుడు చేసిన పనికి ప్రయాణికులు భయంతో కంగారుపడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపవల్సి వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ ప్రయాణికుడు గాలిలోనే విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గురువారం (సెప్టెంబర్ 21) ఇండిగో విమానం అగర్తలలోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో దిగడానికి 10 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. ఘటన జరిగిన సమయంలో అతడు డ్రగ్స్‌ మత్తులో ఉన్నట్లు సమాచారం. వెంటనే విమానంలోని తోటి ప్రయాణికులు అతన్ని బంధించి విమాన సిబ్బందికి అప్పగించారు. ఫ్లైట్‌ సేఫ్‌ ల్యాండింగ్‌ తర్వాత నిందితుడిని ఇండిగో ఎయిర్‌లైన్స్ అగర్తల ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. త్రిపుర పోలీసు ప్రతినిధి జ్యోతిస్‌మన్ దాస్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం..

కోల్‌కతా డమ్ డమ్ విమానాశ్రయంలో దేబ్‌నాథ్ (41) అనే వ్యక్తి అగర్తలాకు వెళ్లేందుకు గౌహతి-అగర్తలా ఇండిగో 6E-457 విమానం ఎక్కాడు. విమానం ఎక్కినప్పటి నుంచి అతను గందరగోళం సృష్టించాడు. మత్తులో విమానం సీటులో సరిగ్గా కూర్చోలేకపోయాడు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులపై కూడా అతడు దాడికి యత్నించాడు. విమానం అగర్తలాలో ల్యాండ్ అవడానికి సరిగ్గా పది నిముషాల ముందు అతను తన సీట్లో నుంచి లేచి విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు. గాలిలో విమానం ఉండగా ఎమర్జెన్సీ డోర్‌ను తెరిస్తే గాలి పీడనం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంతలో విమాన సిబ్బంది అతన్ని ఎలాగోలా అడ్డుకున్నారు. సదరు వ్యక్తి చర్యకు ఆగ్రహించిన ప్రయాణికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ప్రయాణికుల సామూహికంగా కొట్టిన ఘటనలో నిందితుడి బట్టలు చిరిగిపోయి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. అయినప్పటికీ అతనికి బుద్ధిరాలేదు. సీటులో కూర్చున్న తర్వాత కూడా దేబ్‌నాథ్ తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు. విమాన సిబ్బంది, ప్రయాణికులు దేబ్‌నాథ్‌ను బంధించి పట్టుకున్నారు. తరువాత అగర్తలలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ పోలీసులకు అతన్ని అప్పగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.