Viral Video: పాము కాటేసిందనీ.. బతికుండగానే చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికి వెళ్లిన పెద్ద మనిషి! ఆ తర్వాత

ఆటో డ్రైవర్‌ను పాము కాటేసింది. అంతే అతగాడు దాన్ని అమాంతం పట్టి బతికుండగానే చొక్కాలో వేసుకున్నాడు. అనంతరం పాముతోపాటు చకచకా దగ్గరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు అతగాడిని కనీసం పట్టించుకోలేదు. 'పాము కరిచింది బాబోయ్‌..' అన్నా కనీసం ఎవరూ స్పందించకపోవడంతో..

Viral Video: పాము కాటేసిందనీ.. బతికుండగానే చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికి వెళ్లిన పెద్ద మనిషి! ఆ తర్వాత
Man Carries Snake To Hospital After Being Bitten

Updated on: Jan 14, 2026 | 2:04 PM

మ‌థుర‌, జనవరి 14: ఓ ఆటో డ్రైవర్‌ను పాము కాటేసింది. అంతే అతగాడు దాన్ని అమాంతం పట్టి బతికుండగానే చొక్కాలో వేసుకున్నాడు. అనంతరం పాముతోపాటు చకచకా దగ్గరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు అతగాడిని కనీసం పట్టించుకోలేదు. ‘పాము కరిచింది బాబోయ్‌..’ అన్నా కనీసం ఎవరూ స్పందించకపోవడంతో చిర్రెత్తుకొచ్చి రోడ్డెక్కి నానా హంగామా చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూపీలో మ‌థుర‌లో ఈ-రిక్షా న‌డిపే దీపక్ (39) అనే డ్రైవ‌ర్‌ను ఓ పాము కాటేసింది. అయితే అత‌ను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్ప‌త్రికి వెళ్లాడు. అక్కడ తనను పామును కాటు వేసిందని, చికిత్స చేయాలని అడిగాడు. అయితే అక్కడి వైద్య సిబ్బంది యాంటీ-విష చికిత్స కోసం కాసేపు వేచి ఉండాలని సూచించారు. దీంతో అతడు ప్రశాంతంగా తన చొక్కా జేబులో పామును పెట్టుకుని అరగంట సేపు కూర్చున్నాడు. అయితే ఎవరూ దీపక్‌ని పట్టించుకోకపోవడంతో కోపం నషాలానికి అంటింది. త‌న‌కు చికిత్స చేయ‌డం లేద‌ని గోల చేశాడు. అయితే అక్కడి సిబ్బందిలో ఒక‌రు వ‌చ్చి అత‌న్ని ఏం పాము కాటేసింద‌ని అడిగారు. ఆ పాము ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. దీంతో దీప‌క్ త‌న ష‌ర్ట్‌లో దాచిపెట్టిన బతికున్న పామును తీసి చూపించాడు.

ఇవి కూడా చదవండి

ష‌ర్ట్‌లో నుంచి స‌జీవంగా ఉన్న సర్పాన్ని తీయ‌డంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురైయ్యారు. ఆ పాము అడుగున్నర పొడుగు ఉంది. పాము కాటేసి 30 నిమిషాలు అవుతోంద‌ని, ఆస్ప‌త్రిలో ఎటువంటి స‌దుపాయాలు లేవ‌ని దీప‌క్ కోపంతో ఊగిపోయాడు. వైద్యులు ఆ పాము జాతిని గుర్తించి, తగిన చికిత్స నిర్ణయించడానికి వీలుగా పామును కూడా ఆస్పత్రికి తీసుకొచ్చానని చెప్పడం విశేషం. తరువాత స్థానిక అధికారులు ఆ పామును సురక్షితంగా రక్షించారు. దీపక్‌కు విష నిరోధక మందు ఇచ్చారు. అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన యొక్క వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.