Watch: అయ్యో పాపం.. 19ఏళ్ల యువతి ప్రాణం తీసిన పారా గ్లైడింగ్..షాకింగ్‌ వీడియో వైరల్

టేకాఫ్‌ చేయగానే ప్యారాషుట్‌ చెడిపోవడంతో ఇద్దరూ కొండపై నుంచి కాలువలో పడిపోయారని చెప్పారు. ఇద్దరిని వెంటనే గుర్తించారు. ఖుషీ సంఘటన స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఖుషీ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Watch: అయ్యో పాపం.. 19ఏళ్ల యువతి ప్రాణం తీసిన పారా గ్లైడింగ్..షాకింగ్‌ వీడియో వైరల్
Paragliding

Updated on: Jan 20, 2025 | 6:02 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఘోర ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్‌లో ప్రయాణిస్తున్న 19 ఏళ్ల యువతి మృతి చెందగా, పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ షాకింగ్‌ సంఘటన శనివారం ధర్మశాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంగ్రా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బీర్ బహదూర్ తెలిపిన వివరాల ప్రకారం.. భావ్‌సర్ ఖుషీ అనే 19 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం అహ్మదాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చింది. ఖుషీ ఇంద్రునాగ్ సైట్‌లో పారాగ్లైడింగ్ రైడ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఆమె పైలట్‌తో బయలుదేరినప్పుడు సాంకేతిక లోపం కారణంగా వారిద్దరూ కొండపై నుండి పడిపోయారు.

టేకాఫ్‌ చేయగానే ప్యారాషుట్‌ చెడిపోవడంతో ఇద్దరూ కొండపై నుంచి కాలువలో పడిపోయారని చెప్పారు. ఇద్దరిని వెంటనే గుర్తించారు. ఖుషీ సంఘటన స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఖుషీ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఖుషీ కుటుంబీకుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగినప్పుడు నిబంధనలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమాదం సాయంత్రం 5.45 గంటలకు జరిగిందని, అయితే భద్రతా నిబంధనల ప్రకారం, సైట్ వద్ద పారాగ్లైడింగ్ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..