Viral Video: యమలోకం బోర్డర్‌లో నిలబడి హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ రీల్స్.. రెప్పపాటులో లోయలోకి! వీడియో

|

Sep 17, 2024 | 11:19 AM

ఓ యువతి భయంకరమైన లోయలో రీల్స్‌ చేస్తూ పట్టుతప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

Viral Video: యమలోకం బోర్డర్‌లో నిలబడి హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ రీల్స్.. రెప్పపాటులో లోయలోకి! వీడియో
Woman's Fall Into Valley
Follow us on

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడానికి ఇటీవల కాలంలో యువత రకరకాల పిచ్చిపనులు చేస్తున్నారు. రీల్స్‌ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓవర్‌నైట్‌ స్టార్‌ డమ్‌ కోసమే.. లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మారాలనుకుంటారో.. కారణం ఏదైతేనేం తమకు తాము హాని చేసే విధంగా రకరకాల స్టంట్‌లను చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎందరో ప్రమాదకర ప్రదేశాల్లో డేంజరస్‌ స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువతి భయంకరమైన లోయలో రీల్స్‌ చేస్తూ పట్టుతప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా లోని పర్వతాల మధ్య ఉన్న అతిపెద్ద లోయ రీల్‌ షూట్ చేసేందుకు ఓ యువతి యత్నించింది. లోయలో దిగి ఓ బండరాయిపై నిలబడి చేతులతో చున్నీ ఎగురవేస్తూ ప్రముఖ బాలీవుడ్ సాంగ్‌ ‘బేపనా ప్యార్ హై..’ డ్యాన్స్‌ చేయసాగింది. ఈ వీడియోను సమీపంలోని తన స్నేహితురాలు కెమెరాతో వీడియో తీయసాగింది. అనంతరం బండరాయిపై నుంచి కిందకి దూకి.. పరిగెడుతుండగా స్లిప్‌ అయ్యి ఒక్కసారిగా లోయలోకి దొర్లుకుంటూ పడిపోయింది. ఒక యువతి హింసాత్మకంగా పడిపోయినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. కెమెరా వెనుక ఉన్న ఆమె స్నేహితురాలు భయపడిపోవడంతో ఆమె దొర్లుకుంటూ కొంత దూరం వరకు పడిపోయింది. అయితే ఆమె లోయలో పడిపోయిందో.. లేదంటే ప్రాణాలతో బయటపడిందో.. ఆ వివరాలు తెలియరాలేదు. వీడియోలో కనిపిస్తున్న యువతిని పూజగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు.. ప్రమాదకర ప్రదేశంలో వీడియోలు తీయడం అవసరమా అంటూ సదరు యువతిని తిట్టిపోశారు. దీంతో తాను పూర్తిగా లోయలో పడిపోలేదని, స్వల్పగాయాలతో బయటపడ్డానని., ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ధృవీకరిస్తూ.. పూజా మరో వీడియోను విడుదల చేసింది. వీడియో షూట్ చేస్తుండగా కాలుజారి కిందపడిపోయానని వీడియోలో తెలిపింది. అయితే తృటిలో ప్రమాదం తప్పిందని, తాను క్షేమంగా బయటపడటం తన అదృష్టమని ఆమె వీడియోలో పేర్కొంది. కాగా ఈ ఏడాది జూలైలో ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని కుంభే జలపాతం వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తూ 300 అడుగుల లోయలో జారి పడిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.