సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతుంది. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో ఓ ప్రయాణీకురాలిని వేధిస్తున్న టీటీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అది రైల్వే శాఖ అధికారుల దృష్టికి చేరుకుంది. దీంతో మత్తులో మహిళా ప్రయాణికురాలిని వేధించినందుకు రైలు టికెట్ (టిటి) ఎగ్జామినర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలికి, టీటీకి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో గత 48 గంటల్లో వైరల్‌గా మారింది. టిటి ఒక మహిళా ప్రయాణీకురాలిని టిక్కెట్ చూపించమని అడిగాడు. టికెట్ బుక్ చేసుకున్నానని చెబుతుంటే.. ఆ టికెట్ కలెక్టర్ ఆ మహిళపై గట్టిగా అరిచాడు.. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. తోటి ప్రయాణీకులు వారిస్తున్నా టీటీ వినలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆ అధికారి తనను కావాలనే వేధించాడని బాధితురాలు ఆరోపించింది.
Drunk TT pulled her at KJM . While the girl was telling she had her ticket, showed ticket to TT but TT didn’t listen anything,pulled her and still misbehave with her.We need explanation for on duty drunk TT.@RailMinIndia@Central_Railway please take strict action against the TT. pic.twitter.com/UUjRcm8X1w
— Karishma behera (@karishma_behera) March 14, 2023
ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడని ఆరోపించాడు. డ్యూటీలో ఉండగా మందు తాగడం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ అధికారులు వెంటనే ఆ టీటీని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..