సాధారణంగా నడుస్తున్న సైకిల్‌పై నుంచి పడితేనే దెబ్బలు తగులుతాయి.. అలాంటిది ఏకంగా 110 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్న ట్రైన్ నుంచి కింద పడితే? ఇంకేముంది.. యమపురికి టికెట్ కన్ఫామ్ అవుతుంది. కానీ, ఇక్కడ ఓ యువకుడి విషయంలో మిరాకిల్ జరిగింది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ నుంచి కింద పడ్డా ఆ యువకుడు ప్రాణాలతో నిలిచాడు. అంతేకాదండోయ్.. ఒంటిపై చిన్న గాయం కూడా అవలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకోగా.. ఇందుకు సంబందించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌ను ట్రైన్ సమీపించింది. ఇంతలో ఓ యువకుడు రైలు నుంచి ఒక్కసారిగా జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ ఫాం మీద అలాగే జారుతూ రైలుతో పాటు ముందుకు వెళ్లాడు. అంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడ్డప్పటికీ ఆ యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డైంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
Viral video of a lucky young man who fell from an express train at 110 mph in Shahjahanpur, Uttar Pradesh, India, slipped on the platform for 100 meters, and then stood up.#viral #ViralVideos pic.twitter.com/PXIRUU1bvv
— Zugson (@izugson) June 20, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..