గొరక్‌పుర్, మార్చి 11: రైలు ప్రయాణం చాలా మందికి సరదాగా ఉంటుంది. పైగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు ఒక్క రైల్లో మాత్రమే ఉంటుంది. అయితే, రైళ్లలో రద్దీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. టికెట్ ధర తక్కువగా ఉండటంతో తక్కువ దూరానికి కూడా అధిక మంది రైలు జర్నీని ఎంచుకుంటూ ఉంటారు. దీంతో సీట్ల కోసం నిత్యం ఏదో ఒక చోట ఉరుములేని పిడుగులా గొడవలు జరుగుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా అటువంటి మరో సంఘటన రైటులో చోటు చేసుకుంది. సీటు కోసం తల్లీకూతుళ్లిద్దరూ ఓ వ్యక్తిని రఫ్ ఆడించారు. వ్యక్తి కాలర్ పట్టుకుని సీటు ఖాళీ చేయాలంటూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేసుకోండి..
ఈ వీడియోలో తల్లీ కుమార్తెలు ఇద్దరూ సీటుకోసం ఓ వ్యక్తితో గొడవ పడటం కనిపిస్తుంది. రైల్లో పై బెర్తులో కూర్చున్న వ్యక్తితో ఆ తల్లీ కూతుళ్లు గొడవకు దిగారు. అతడి కాలర్ పట్టుకొని దుర్బాషలాడారు. ఈ సంఘటన సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు డెహ్రాడూన్-గోరఖ్‌పూర్ ట్రైన్‌లో చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఈ గొడవను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘మహిళా దినోత్సవం రోజున సీట్ సమస్యలపై డెహ్రాడూన్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న రైలులో తల్లీ-కూతుళ్లు ఓ వ్యక్తితో గొడవ పడుతున్న వీడియో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
@gharkekalesh pic.twitter.com/fy6UTNeHcx
— Arhant Shelby (@Arhantt_pvt) March 8, 2024
ఇక ఈ వీడియోలో చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్లు భయంతో ఇద్దరి మధ్య జరుగుతున్న వాగ్వాదం చూడటం గమనించవచ్చు. ఈ వీడియో పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఇదీ చాలా కామన్ అంటూ కొందరు కొట్టిపారేస్తే.. మరికొందరేమో రిజర్వేషన్ కోచ్‌లో టికెట్‌లేకుండా ఇలా ప్రయాణించే వారిని అనుమతించడం వల్లనే ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని.. రైల్వే వ్యవస్థలోని సమస్యల గురించి మరికొందరు నెటిజన్లు ఏకరువు పెట్టారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.