Video: రైలు ప్యాసెంజర్లకు షాకింగ్‌ వీడియో.. తిని పారేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి మళ్లీ వాడేస్తున్నారు..!

ఓ ప్రయాణికుడు ఈరోడ్‌-జోగ్బాని అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (16601)లో ఆహార పదార్ధాలను సరఫరా చేసే డిస్పోజబుల్‌ కంటైనర్లను వాష్‌ బేసిన్‌లో కడగడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీటిని తిరిగి వాడేందుకే శుభ్రం చేస్తున్నారేమోనని ఈ వీడియో చూసిన వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఈ దృశ్యం ఇండియన్‌ రైళ్లలోని..

Video: రైలు ప్యాసెంజర్లకు షాకింగ్‌ వీడియో.. తిని పారేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి మళ్లీ వాడేస్తున్నారు..!
Train Catering Staff Washing Used Casseroles To Reuse

Updated on: Oct 20, 2025 | 11:13 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తిని పడేసిన డిస్పోజబుల్‌ ఫుడ్ కంటెయినర్స్‌ను క్యాటెరింగ్ సిబ్బంది మళ్లీ క్లీన్ చేసి వాటిలోనే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రయాణికుడు ఈరోడ్‌-జోగ్బాని అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (16601)లో ఆహార పదార్ధాలను సరఫరా చేసే డిస్పోజబుల్‌ కంటైనర్లను వాష్‌ బేసిన్‌లో కడగడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీటిని తిరిగి వాడేందుకే శుభ్రం చేస్తున్నారేమోనని ఈ వీడియో చూసిన వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఈ దృశ్యం ఇండియన్‌ రైళ్లలోని ఆహార శుభ్రత భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు IRCTC సోషల్ మీడియా అధికారిక ఎక్స్‌ ఖాతాల ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అందులో పేర్కొంది. డిస్పోజబుల్‌ ఫుడ్ కంటెయినర్స్‌ కడుగుతున్న విక్రేతను గుర్తించి, వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది. లైసెన్స్ దారుడి లైసెన్స్‌ కూడా రద్దు చేసినట్లు IRCTC తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వారికి భారీగా జరిమానా కూడా విధించినట్లు తెలిపింది. డిస్పోజబుల్‌ ఫుడ్ కంటెయినర్స్‌ ఒకసారి తిని పడేసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వీడియోలో కడుగుతున్న డిస్పోజబుల్‌ ఫుడ్ కంటెయినర్స్‌ పారవేసే ముందు శుభ్రం చేశారు. వాటిని తిరిగి ఫుడ్‌ తినేందుకు ఉపయోగించలేదు. మా దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. రైల్వేలో ఆహార భద్రత గురించి తప్పుదోవ పట్టించే వార్తలు వ్యాప్తి చేయవద్దు అని IRCTC తన వివరణలో పేర్కొంది. పరిశుభ్రత ప్రోటోకాల్‌లను పాటిస్తున్నామని, ఆ కడిగిన కంటైనర్‌లను ప్రయాణీకుల భోజనం కోసం తిరిగి ఉపయోగించ లేదని ఈ మేరకు వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ప్రయాణీకుల ఆహార భద్రత, పరిశుభ్రతను మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిలో భోజన తయారీని పర్యవేక్షించడానికి కిచెన్‌లలో కెమెరాలను ఏర్పాటు చేయడం, క్యాటరింగ్ సేవలకు తప్పనిసరి FSSAI ధృవీకరణను అమలు చేయడం, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం వంటివి అమలు చేస్తున్నామని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.