
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన ఒక స్ట్రీట్ ఫైట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది సాధారణ స్ట్రీట్ ఫైట్ కాదు. ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఫైట్. ఓ కారు డ్రైవర్, కూరగాయలు అమ్ముకునే స్ట్రీట్ వెండర్ మధ్య జరిగిన ఫైట్. కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని తక్కువ అంచనా వేసినందుకు ఆ కారు డ్రైవర్ గుణపాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. కూరగాయల స్ట్రీట్ వెండర్‌ను కొట్టబోయిన డ్రైవర్ రివర్స్ దెబ్బలు తిన్నాడు. జనసమూహం మధ్య జరిగిన ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని చందౌసి ప్రాంతంలో, పోలీస్ స్టేషన్ ముందు జరిగింది. ఒక కారు కూరగాయల వ్యాపారి బండిని ఢీకొట్టినట్లు వీడియోలో ఉంది. పరిస్థితిని ప్రశాంతంగా పరిష్కరించడానికి బదులుగా, కారు డ్రైవర్ వైఖరితో గొడవ జరిగింది. బయటకు వచ్చి కూరగాయల విక్రేతను కొట్టడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో అతడు ఊహించని సంఘటన జరిగింది.
కూరగాయల విక్రేత తనను తాను రక్షించుకోవడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. డ్రైవర్ దగ్గరగా వచ్చేసరికి, కూరగాయల విక్రేత ఒక్క సెకండ్ కూడా వేచి చూడకుండా ఎదురుదాడి చేశాడు. తరువాత ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఫైటింగ్‌లో కూరగాయల విక్రేత పైచేయిగా నిలిచాడు. డ్రైవర్ బలంగా కనిపించినప్పటికీ కూరగాయల విక్రేత ముందు నిలబడలేకపోయాడు. కేవలం 30 సెకన్లలోనే మూలకు నిలబడి పోయాడు. విక్రేత నిశ్శబ్దంగా తన బండిని తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కూరగాయల విక్రేతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్లున్నాడని చమత్కరిస్తున్నారు. పేదలను తక్కువగా అంచనా వేస్తే ఇలాంటి గుణపాఠమే ఉటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూస్తే ఫిట్‌నెస్ ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
అయితే వైరల్ అయిన వీడియోను పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Kalesh b/w a Vegetable vendor and a Car Driver over hitting the cart on the car, Sambhal UP
pic.twitter.com/jLJB3dM7Zb— Ghar Ke Kalesh (@gharkekalesh) April 10, 2025