షాకింగ్‌ వీడియో.. బస్సులో డ్రైవర్‌, ప్రయాణికురాలు, మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందో చూడండి!

ఈ మధ్యకాలంలో బస్సుల్లో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యగోలు మధ్య గొడవలు సహజంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు కండక్టర్లతో గొడవలు పెట్టుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో డ్రైవర్‌తో గొడవలు దిగుతున్నారు. ఇది ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తాజాగా మన పక్కరాష్ట్రం కర్ణాటకలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బస్సులో డ్రైవర్‌, మహిళా ప్రయాణికురాలి మధ్య చెలరేగిన వివాదం చివరకు చెంపదెబ్బల వరకూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

షాకింగ్‌ వీడియో.. బస్సులో డ్రైవర్‌, ప్రయాణికురాలు, మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందో చూడండి!
Karnataka Bus Video

Updated on: Sep 12, 2025 | 6:30 AM

బస్సులో డ్రైవర్‌, మహిళా ప్రయాణికురాలి మధ్య చెలరేగిన వివాదం చివరకు చెంపదెబ్బల వరకూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పీన్యా సమీపంలో బీఎంటీసీ బస్సులో ప్రయాణికురాలు, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చెలరేగింది. మాటా మాటా పెరగడంలో ఈ వివాదం కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. దాదాపు అరగంట పాటు ఈ గొడవకు కొనసాగుతూనే ఉంది. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఇందుకు సంబంధించిన వీడియోలను తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేయగా కర్ణాటక పోర్ట్‌ఫోలియో’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయబడింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో పోలీసుల దృస్టికి చేరింది. ఘటనపై స్పందించిన బెంగళూరు నగర పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం ఈ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపినట్లు తెలిపారు. అలాగే ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే డ్రైవర్, ప్రయాణికురాలి మధ్య ఈ గొడవకు అసలు కారణం ఏమిటనేది ఇప్పటికి వరకు స్పష్టం కాలేదు.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు డ్రైవర్‌ ప్రవర్తనను తప్పు పడుతూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం మహిళదే తప్పంటూ.. విధుల్లో ఉద్యోగిపై చేయిచేసుకున్నందుకు.. సదురు ప్రయాణికురాలిని అరెస్ట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.