ఆన్‌లైన్‌లో దొరకని సర్వీసంటూ లేదని వీరిని చూస్తూ తెలుస్తుంది. స్పేస్ రాకెట్, ఫుడ్ డెలివరీ దగ్గరి నుంచి చనిపోయాక కర్మకాండల వరకు సర్వం ఆన్‌లైన్ సర్వీస్ చేస్తున్నారు. అవును.. మీరు సరిగ్గానే చదివారు. తాజాగా ముంబయికి చెందిన స్టార్టప్ బిజినెస్ మోడల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆత్మీయులను కోల్పోయి, బాధలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడకుండా కర్మకాండలు జరిపిస్తుందట. అంతేకాదండోయ్.. కర్మకాండలతోపాటు, అంబులెన్స్ సర్వీస్, డెత్ సర్టిఫికెట్ పొందేందుకు సాయం చేయడంవంటి సేవలను అందిస్తామని చెబుతోంది. ఖర్చులు కూడా తెలిపిదండోయ్ ఎంతంటే.. రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తుందట.
ఈ స్టార్టప్‌కు సంబంధించిన ఫొటోను అవనీష్ వైష్ణవ్ అనే ఐఏఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఉందా? అని తన పోస్టులో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి సేవలు భారత్‌లో కొత్త కావచ్చు. అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, చివరి రోజుల్లో ఇబ్బందిపడే వారికి ఈ స్టార్టప్ సేవలు ఉపయోగపడతాయని.. పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు తెల్పుతున్నారు.
ऐसे ‘स्टार्टअप’ की ज़रूरत क्यों पड़ी होगी ? pic.twitter.com/UekzjZ5o7b
— Awanish Sharan (@AwanishSharan) November 20, 2022
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.