వెంకయ్యతో విజయసాయి భేటీ

వైసీపీ రాజ్యసభ ఎంపీ, వాణిజ్యానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అయిన విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు.

వెంకయ్యతో విజయసాయి భేటీ

Edited By:

Updated on: Aug 26, 2020 | 2:59 PM

వైసీపీ రాజ్యసభ ఎంపీ, వాణిజ్యానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అయిన విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. ఉదయం ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన విజయసాయి… వాణిజ్య విభాగానికి సంబంధించిన 154వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యనాయుడుకు అందజేశారు. వ్యవసాయ.. సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పసుపు, కొబ్బరిపీచు వంటి పంటలకు సంబంధించిన రిపోర్టును గౌరవనీయ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతికి అందించానని విజయసాయి పేర్కొన్నారు.