Actor Vijayakanth: విజయ్‌కాంత్‌కు అస్వస్థత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్ బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అస్వస్థతకు గురయ్యారు....

Actor Vijayakanth: విజయ్‌కాంత్‌కు అస్వస్థత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు
Vijaykanth

Updated on: May 19, 2021 | 9:53 AM

కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్ బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు త‌లెత్త‌డంతో.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆయ‌న్ను చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డాక్ట‌ర్లు ఆయనకు అత్య‌వ‌స‌ర‌ చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం విజయకాంత్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉన్న‌ట్లు వార్తలు వెలువడున్నాడు. అయితే డీఎండీకే విడుద‌ల చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లో మాత్రం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు చెబుతున్నారు.

గతేడాది విజయ్‌కాంత్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. లైట్ సింట‌మ్స్ కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అప్పట్లో ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడిన విషయం తెలిసిందే.

Also Read:  అచ్చం మనిషిలాగే.. కుక్క అద్భుత యోగాసనాలు.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో

5 రోజుల క్రిత‌మే పెళ్లి.. చికెన్ తెచ్చేందుకు వెళ్లి.. అనంత‌లోకాల‌కు

Loading...
Unable to load recommendations.
Follow Us