Viral Video: రెండు ట్రక్కుల మధ్య నలిగి నుజ్జనుజ్జయిన కారు.. ఒకరు మృతి.. లైవ్ వీడియో

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఓ వైపు నుంచైనా ప్రమాదం(Accident) ముంచుకురావచ్చు. మనం జాగ్రత్తగా వెళ్తున్నా... ఇతరులు అంతే జాగ్రత్తగా వస్తారన్న నమ్మకమూ లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి....

Viral Video: రెండు ట్రక్కుల మధ్య నలిగి నుజ్జనుజ్జయిన కారు.. ఒకరు మృతి.. లైవ్ వీడియో
Car Accident

Updated on: Apr 04, 2022 | 3:59 PM

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఓ వైపు నుంచైనా ప్రమాదం(Accident) ముంచుకురావచ్చు. మనం జాగ్రత్తగా వెళ్తున్నా… ఇతరులు అంతే జాగ్రత్తగా వస్తారన్న నమ్మకమూ లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా భువనేశ్వర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో జరిగిన ఈ ప్రమాదం ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌(Bhubaneshwar) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు రోడ్డుపై ఆగిపోయింది. దీని వెనుకాలే మరో ట్రక్కు వచ్చింది. అది అదుపు తప్పి ముందు వస్తున్న కారును ఢీ కొట్టుకుంటూ ట్రక్కును ఢీ కొట్టింది. భువనేశ్వర్‌లోని పాలసుని ప్రాంతంలో జాతీయ రహదారి-16పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం జరిగిన తర్వాత డంప్‌ లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

AP CM YS Jagan: గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలుః సీఎం జగన్‌

TS TET 2022: టెట్‌లో గట్టెక్కకుంటే మా గతేంటి? సీటెట్‌ మాదిరి ఏడాదికోసారైనా టెట్ నిర్వహించండి మహప్రభో!