Video: హెలికాప్టర్ లాండింగ్ సమయంలో గాలి దుమారం.. మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం..

సమయంలో ఆకస్మాత్తుగా గాలిదుమారం వచ్చింది. దీంతో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ చేయలేకపోయాడు పైలెట్‌ . గాలిలో కాసేపు చక్కర్లు కొట్టిన తరవాత తిరిగి ఆ హెలికాప్టర్‌ వెళ్లిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో..

Video: హెలికాప్టర్ లాండింగ్ సమయంలో గాలి దుమారం.. మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం..
Bs Yediyurappa's Chopper Landing

Updated on: Mar 06, 2023 | 4:09 PM

కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప హెలికాప్టర్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కలబుర్గి జిల్లా జెవార్జీ దగ్గర హెలికాప్టర్‌ ల్యాండవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గాలిదుమారం వచ్చింది. దీంతో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ చేయలేకపోయాడు పైలెట్‌ . గాలిలో కాసేపు చక్కర్లు కొట్టిన తరవాత తిరిగి ఆ హెలికాప్టర్‌ వెళ్లిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో జెవార్జీలో యడియూరప్ప హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాలేదు. దీంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు యడియూరప్ప. కర్ణాటకలోని కాలబురగిలో సోమవారం (మార్చి 6) మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్ధంతరంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు స్వాగతం పలికేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వారందరూ వెనక్కి వెళ్లిపోయారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us