కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో జోష్ నింపేందుకు అస్సాంలో ఓ డాక్టర్ ఏకంగా డ్యాన్సరే అయ్యారు. డాక్టర్ అరుప్ సేనాపతి అనే ఈయన సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పూర్తి పీపీఈ కిట్లను ధరించి రోగుల ఎదుట డ్యాన్స్ చేశారు. ‘వార్ ‘ చిత్రంలోని ‘ఘున్గ్రూ’ పాటకు ఎంచక్కా మైండ్ బ్లోయింగ్ స్టెప్పులేశారు. ఈయన స్నేహితుడైన మరో డాక్టర్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేయగానే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈఎన్టీ సర్జన్ కూడా అయిన అరుప్ సేనాపతికి అసలు డ్యాన్సింగ్ లో ఏ మాత్రం అనుభవం లేదు. కానీ కరోనా వైరస్ రోగులను హ్యాపీగా ఉంచడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
Meet my #COVID duty colleague Dr Arup Senapati an ENT surgeon at Silchar medical college Assam .
Dancing infront of COVID patients to make them feel happy #COVID19 #Assam pic.twitter.com/rhviYPISwO— Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) October 18, 2020