Viral News: ఆమె కోసం.. అతడుగా మారిన యువతి.. పెద్దలు ఒప్పుకోలేదని షాకింగ్ నిర్ణయం..

|

Jun 27, 2022 | 1:08 PM

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఇద్దరు యువతులు (లెస్బియన్లు) ప్రేమించుకున్నారు. వారు జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకోగా.. వారి సంబంధాన్ని ఇరు యువతుల కుటుంబాలు వ్యతిరేకించాయి.

Viral News: ఆమె కోసం.. అతడుగా మారిన యువతి.. పెద్దలు ఒప్పుకోలేదని షాకింగ్ నిర్ణయం..
Up Woman Switches Gender
Follow us on

Uttar Pradesh woman switches gender: ఇద్దరు యువతులు.. ఒకరంటే ఒకరిపై అమితమైన ప్రేమ.. చివరికి కలిసి కాపురం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు వారి బంధాన్ని వ్యతిరేకించారు. దీంతో ఓ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన ప్రియురాలి కోసం ఓ యువతి లింగమార్పిడి చేయించుకుంది. ఈ షాకింగ్ ఘటన సోమవారం ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఇద్దరు యువతులు (లెస్బియన్లు) ప్రేమించుకున్నారు. వారు జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకోగా.. వారి సంబంధాన్ని ఇరు యువతుల కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో ఓ యువతి స్నేహితురాలితో కలిసి ఉండటానికి తన లింగాన్ని మార్చుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకుంది. తన భాగస్వామితో ప్రేమలో ఉన్న ఆమె.. అడ్డంకులను నివారించడానికి, కుటుంబసభ్యుల జోక్యాన్ని ఆపడానికి తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి ముందు కుటుంబాలను ఒప్పించడానికి ప్రయత్నించింది.. కానీ ఫలించలేదు. దీంతో ఆమెకు వేరే మార్గం లేక తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చిందన్నారు.

శస్త్రచికిత్స చికిత్స చేసిన ప్రయాగ్‌రాజ్ వైద్యులు..

ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని వైద్యుల బృందం యువతి శరీర పైభాగాలు, ఛాతీ పునర్నిర్మాణానికి వీలుగా లింగమార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. శస్త్రచికిత్సకు మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ఆ తర్వాత యువతి పురుషుడిగా మారుతుందని వైద్యులు పేర్కొన్నారు. లింగమార్పిడి చేయించుకున్న యువతికి టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తామని, దీనివల్ల ఛాతీ భాగంలో వెంట్రుకలు వస్తాయని వైద్యులు తెలిపారు. లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత మహిళ గర్భవతి అయ్యే పరిస్థితి ఉండదని వైద్య నిపుణుడు డాక్టర్ మోహిత్ జైన్ వివరించారు. టెస్టోస్టెరాన్ థెరపీ ఛాతీ వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారని.. 18 నెలల వ్యవధిలో లింగమార్పిడి చికిత్స పూర్తవుతుందని పేర్కొన్నారు. లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న యువతి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ మోహిత్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..