Raksha Bandhan 2021: శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకునే పండగ రాఖీ పండగ. అన్నా చెల్లెల అనుబంధానికి, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు గుర్తుగా రాఖీ పండగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఎక్కువగా ఈ పండగను ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లోనే జరుపుకునేవారు. ఇక తెలుగు లోగిళ్ళు శ్రావణ పౌర్ణమని జంధ్యాల పున్నామిగా జరుపుకునేవారు.. అయితే ఇప్పుడు జంధ్యం మార్చుకోవడమే కాదు.. అన్న చెల్లెలు ప్రేమగా ప్రేమని తెలుపుతూ.. రాఖీ కడుతున్నారు.
రాఖీ అంటే రక్షణ బంధం.. హిందువులు జారుకునే జరుపుకునే విశిష్టమైన పండగ. సోదరి.. తన సోదరుడు మంచిని, ఉన్నతిని, విజయాన్ని కోరుతూ.. రాఖీ కడుతుంది రాఖీ పున్నమి రోజున. అయితే రాఖీ పండుగ పురస్కరించుకుని ఐఆర్ టీ సి మహిళలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మహిళా ప్రయాణికులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా మహిళలు 15 ఆగస్టు 2021 మరియు 23 ఆగష్టు 2021 మధ్య తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. ఇలా మహిళలు ఢిల్లీ, అహ్మదాబాద్ , ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించవచ్చు.
మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ యోగీ సర్కార్ కూడా ఓ ప్రకటన చేసింది. రక్షా బంధన్ కు వెళ్లే మహిళలకు రాష్ట్రంలో ఏ బస్సులైనా, ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎం యోగీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. రాఖీ రోజున మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని యూపి.ఎస్ ఆర్. టి. సి పేర్కొంది.
Also Read: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ.. స్పెషల్ మెహందీ డిజైన్స్ (photo gallery)