‘ప్రెసిడెంట్ ట్రంప్.. ప్రధాని మోదీకి ప్రత్యేక స్నేహితుడు’: అమెరికా రాయబారి సెర్గియో గోర్

భారత దేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం (అక్టోబర్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో సంబంధానికి అమెరికా ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని అన్నారు. "ప్రధానమంత్రితో సమావేశం అద్భుతం. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించాము" అని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ ట్రంప్.. ప్రధాని మోదీకి ప్రత్యేక స్నేహితుడు: అమెరికా రాయబారి సెర్గియో గోర్
Us Ambassador Sergio Gor Calls On Pm Narendra Modi

Updated on: Oct 11, 2025 | 10:07 PM

భారత దేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం (అక్టోబర్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో సంబంధానికి అమెరికా ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని అన్నారు. “ప్రధానమంత్రితో సమావేశం అద్భుతం. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించాము” అని ఆయన అన్నారు. “కీలకమైన ఖనిజాల ప్రాముఖ్యతను కూడా మేము చర్చించాము” అని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొప్ప, ప్రత్యేక స్నేహితుడుగా భావిస్తున్నారని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ సందేశం, సంతకంతో, వైట్ హౌస్‌లో తాను, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్‌ను ఆయన ప్రధాని మోదీకి బహుకరించారు. ఆ ఫోటోపై ట్రంప్ స్పష్టంగా “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చాలా బాగున్నారు” అని రాశారు. సెర్గియో గోర్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశంలో వచ్చారు. నిర్వహణ, వనరుల శాఖ డిప్యూటీ సెక్రటరీ మైఖేల్ జె. రిగాస్‌తో కలిసి భారత్‌లో పర్యటిస్తున్నారు. అ క్రమంలోనే సీనియర్ భారత అధికారులతో సమావేశమవుతారు.

ఇదిలావుంటే, అమెరికా రాయబారిగా ఎన్నికైన సెర్గియో గోర్‌ను కలిసిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో, ప్రధాని మోదీ, “అమెరికా రాయబారిగా ఎన్నికైన సెర్గియో గోర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. గోర్ పదవీకాలం భారత-అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీనికి కలిసిన తర్వాత అమెరికా రాయబారి సెర్గియో గోర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ రష్యా ముడి చమురు దిగుమతులపై భారత్ భారీ సుంకాలను విధించినప్పటి నుండి భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా చర్యలను అన్యాయం, అసమంజసమని భారత్ ఖండించింది. అయితే, ట్రంప్-మోదీ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ దెబ్బతిన్న సంబంధంలో సానుకూల మార్పు కోసం ఆశలను రేకెత్తించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..