Viral: చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్.. పోలీసుల విచారణలో స్టన్ అయ్యే నిజం

|

Jul 27, 2022 | 6:30 PM

యూపీ, బీహార్ లాంటి రాష్ట్రల్లో మూఢ నమ్మకాల ఇప్పటకీ ప్రబలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగచూసింది.

Viral: చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్.. పోలీసుల విచారణలో స్టన్ అయ్యే నిజం
Representative image
Follow us on

Uttar Pradesh: యూపీలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అనాగరికత, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఇంకా మనుషులను ఎంత దిగజారేలా చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు. షాజహాన్‌పూర్ జిల్లా(Shahjehanpur district)లోని తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రౌలి గ్రామం( Piprauli village )లో నివసిస్తున్న కుబేర్ గంగ్వార్ (60) సోమవారం సాయంత్రం అనారోగ్య కారణాలతో మరణించాడు. మంగళవారం మధ్యాహ్నం అతని అంత్యక్రియలు నిర్వహించారు కటుంబ సభ్యులు.  చితికి నిప్పు పెట్టిన అనంతరం శ్మశానవాటిక నుంచి అందరూ తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచి మాటు వేసు ఉన్నాడో తెలియదు కానీ.. ఓ వ్యక్తి స్మశానికి చేరకున్నాడు.  చితిలో నుండి మృతుడి తలను తొలగించి.. ఇంటికి తీసుకు వెళ్లాడు. తెల్లారి.. చిన్న కర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు స్మశానానికి వెళ్లగా.. కపాలం కనిపించలేదు. మొదట ఏవైనా జంతువులు తీసుకువెళ్లాయేమో అని అనుమానపడ్డారు. కానీ చితికి నిప్పు ఉండటంతో.. అలాంటి చాన్స్ ఉండదని నిర్ధారణకు వచ్చారు. అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. విచారించగా స్టనింగ్ నిజం వెలుగుచూసింది.  గ్రామానికి చెందిన ఉపేంద్ర అలియాస్ గోపి మద్యం మత్తులో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి  కుబేర్ గంగ్వార్ తలను ఇంటికి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

భూతవైద్యం, మంత్రవిద్యను అభ్యసించడానికే తలను తీసుకెళ్లినట్లు ఉపేంద్ర విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్లు మనుషులను కూడా చంపేస్తారు. అందుకే  మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో మూఢ నమ్మకాలలో ఇంకా బలంగా అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం..