హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఆప్ ఎమ్మెల్యే కుల్ దీప్ కుమార్ పై ఎపిడమిక్ యాక్ట్ కింద యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ పాజిటివ్ సోకిన ఈయన ఈ నెల 4 న హత్రాస్ జిల్లాకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన పాజిటివ్ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆయన అక్కడికి వెళ్లి ఆ ఫ్యామిలీని కలుసుకోవడం వివాదాస్పదమైంది. తనకు రెండు రోజుల క్రితం స్వల్ప జ్వరం వచ్చిందని, మళ్ళీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని, ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానన్నారు.
पिछले दो दिनों से मुझे हल्का बुख़ार होने की वजह से आज मैंने #Covid19Test कराया जिसकी रिपोर्ट postive आयी है जिसके बाद मैं घर पर #HomeIsolation में रहूँगा जो भी साथी पिछले 2-3 दिनो में मुझसे मिले है वो अपना टेस्ट ज़रूर करा ले !
— MLA Kuldeep Kumar (@KuldeepKumarAAP) September 29, 2020