
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గురువారం ఉదయం మొహమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. జెట్‌సర్వ్ ఏవియేషన్‌కు చెందిన ట్విన్-ఇంజన్ చార్టర్ విమానం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో రన్‌వే నుంచి టేకాఫ్ అయిత దాదాపు 400 మీటర్లు ప్రయాణించిన తర్వాత అదుపుతప్పి రన్‌వైపై నుంచి జారీ పోయింది. రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన ఈ విమానం సరిహద్దు గొడకు కొద్ది దూరంలో వెళ్లి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకొని ప్రయాణికులు, పైలట్లను టర్మినల్‌కు తరలించారు.
ఖిమ్సేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో రాబోయే బీర్ తయారీ యూనిట్‌ను అంచనా వేయడానికి ఒక బృందంతో వచ్చిన వుడ్‌పెకర్ గ్రీన్ అగ్రి న్యూట్రిప్యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అరోరా, ఎస్‌బిఐ నుండి సుమిత్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) రాకేష్ టిక్కు, యుపి ప్రాజెక్ట్ హెడ్ మనీష్ పాండే ఈ విమానంలో భోపాల్‌కు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై మొహమ్మదాబాద్ కొత్వాలి SHO వినోద్ శుక్లా మాట్లాడుతూ.. విమానం చక్రాలలోని ఒకదానిలో గాలి తక్కువగా ఉండడంతో అది రన్‌వే నుండి పక్కకు తప్పిందని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
#WATCH | Uttar Pradesh: A private aircraft lost control while taking off from the runway in Farrukhabad and collapsed in bushes nearby. The two pilots and passengers are safe.
(Video Source: Police) pic.twitter.com/pWlZOl3rmG
— ANI (@ANI) October 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.