Uttara Pradesh: లక్నో కోర్టులో కాల్పుల కలకలం.. లాయర్ల వేషంలో వచ్చి, అందరి ఎదుటే..

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లక్నో కోర్టులో కాల్పుల కలకలం రేగింది. ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోన్నవేళ కోర్టులోకి ప్రవేశించిన దుండగులు.. జడ్జి ఎదుటే ప్రత్యర్థిపై కాల్పులకు పాల్పడ్డారు. ఇక ఈ కాల్పుల్లో రౌడీ షీటర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ప్రధాన అనుచరుడు..

Uttara Pradesh: లక్నో కోర్టులో కాల్పుల కలకలం.. లాయర్ల వేషంలో వచ్చి, అందరి ఎదుటే..
Sanjeev Jeeva And Mukhtar Ansari

Updated on: Jun 07, 2023 | 6:42 PM

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లక్నో కోర్టులో కాల్పుల కలకలం రేగింది. ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోన్నవేళ కోర్టులోకి ప్రవేశించిన దుండగులు.. జడ్జి ఎదుటే ప్రత్యర్థిపై కాల్పులకు పాల్పడ్డారు. ఇక ఈ కాల్పుల్లో రౌడీ షీటర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ప్రధాన అనుచరుడు సంజీవ్ జీవ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు న్యాయవాదుల వేషం ధరించి కోర్టు ఆవరణ కాల్పులు జరిపారు.

అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి దుండగులు పారిపోయారు. కోర్టు పరిసరాలను భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవ మృతితో పాటు ఇద్దరు పోలీసులతో పాటు ఓ బాలికకు కూడా గాయాలయ్యాయి. కోర్టు ఆవరణలో మొత్తం 5 రౌండ్లలో నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఇంకా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us