UP Farmer Dumps Cauliflower : కిలో కాలిఫ్లవర్ ధర ఒక్క రూపాయి..రోడ్డు మీద పడేసిన రైతు.. అప్పు తీర్చడంకోసం మళ్లీకూలీగా అవతారం

|

Feb 07, 2021 | 12:29 PM

: రైతులు ఆరుగాలాలు ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలతో చేతికి వస్తుందో రాదో  అన్న సందేహం ఓ వైపు.. మరోవైపు చేతికి అందివచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో అన్న...

UP Farmer Dumps Cauliflower : కిలో కాలిఫ్లవర్ ధర ఒక్క రూపాయి..రోడ్డు మీద పడేసిన రైతు.. అప్పు తీర్చడంకోసం మళ్లీకూలీగా అవతారం
Follow us on
 UP Farmer Dumps Cauliflower : రైతులు ఆరుగాలాలు ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలతో చేతికి వస్తుందో రాదో  అన్న సందేహం ఓ వైపు.. మరోవైపు చేతికి అందివచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో అన్న భయం.. ఏది ఏమైనా అందరికీ అన్నం పెట్టె అన్నదాత జీవితం ఎప్పుడూ కన్నీటి మయంగానే మిగిలిపోతోంది. దేశంలో పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.. దింతో పెద్దఎత్తున రైతులు నష్టపోతున్నారనడానికి ఉదాహరణగా నిలుస్తోంది తాజాగా సంఘటన. 
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా తక్కువ ధరకు ఆ పంటను అమ్మడమో.. లేక దానిని రోడ్లమీద పారబోయడమో చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు సర్వసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతులు చేస్తుండగా చూస్తుంటాం.. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన 1000 కిలోల కాలిప్లవర్ పంటను రోడ్డు మీద పారబోశాడు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహమ్మద్ సలీం అనే రైతు అర ఎకరం పొలంలో కాలిప్లవర్ పంటను వేశాడు.. అది చెతికొచ్చే క్రమంలో రూ. 8వేల వరకూ ఖర్చు పెట్టాడు. పంట ఇప్పుడు వెయ్యి కిలోలు చేతికి వచ్చింది. సమీప వ్యవసాయ మార్కెట్ కు ఆ పంటను ర్టూ. 4 వేలు ఖర్చు పెట్టి తరలించాడు.  అయితే అక్కడ దళారులు కిలో పంటకు రూ. 1 మాత్రమే ఇస్తానని చెప్పాడు. దీంతో సలీం కు ఓ రేంజ్ లో కోపం వచ్చి.. ఆ పంట మొత్తాన్ని రోడ్డు పై పారబోశాడు. 

గతంలో కాలిఫ్లవర్ పంటకు కిలోకు రూ.12 నుంచి రూ.14 ధర వచ్చేది. తాను కిలోకు కనీసం రూ.8 అయినా వస్తుందని భావించానని సలీం చెప్పాడు. అయితే మరీ దారుణంగా కిలో రూపాయి అనే సరికి.. ఆ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి అయినా మళ్ళీ రవాణా ఖర్చులు కావాలి కనుక ఎందుకు దండగ అన్ని చెప్పి కాలిప్లవర్ పంట మొత్తాన్ని రోడ్డుమీద పారబోసినట్లు చెప్పాడు.

అంతేకాదు పంట కోసం తాను చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి కూలీ పనికి వెళ్లాలని.. తనపై తల్లి, కుటుంబసభ్యులు ఆధారపడి బతుకుతున్నారని.. ఇప్పుడు తనకు ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదంటూ వాపోయాడు సలీం

Also Read:

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు.. గత 24 గంటల్లో వందలోపులోనే మృతి

శాస్త్రజ్ఞులకే సవాల్ విసురుతున్న కరోనా.. ప్రపంచంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు