Ayodhya: రామ జ్యోతిని వెలిగించిన కేంద్రమంత్రి.. ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్..

|

Jan 22, 2024 | 11:30 PM

ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించిన దేశ ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. కొన్ని చోట్ల బాణా సంచాలు కాల్చి దీపావళి జరుపుకున్నారు. అయోధ్య నుంచి ఢిల్లీకి వెళ్లిన ప్రధాని తన ఇంట్లో రామ జ్యోతిని వెలిగించాడు. ఇక పలువురు కేంద్ర మంత్రులు సైతం దీపాలను వెలిగించారు...

Ayodhya: రామ జ్యోతిని వెలిగించిన కేంద్రమంత్రి.. ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్..
Dharmendra Pradhan
Follow us on

అయోధ్య రామ మందిర మహా కృతువు ముగిసింది. 500 ఏళ్ల దేశ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఇక బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ రామ జ్యోతిని వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించిన దేశ ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. కొన్ని చోట్ల బాణా సంచాలు కాల్చి దీపావళి జరుపుకున్నారు. అయోధ్య నుంచి ఢిల్లీకి వెళ్లిన ప్రధాని తన ఇంట్లో రామ జ్యోతిని వెలిగించాడు. ఇక పలువురు కేంద్ర మంత్రులు సైతం దీపాలను వెలిగించారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.  ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం దీపాలను వెలిగించారు.

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..

సోమవారం రాత్రి తన ఇంట్లో రామ జ్యోతిని వెలిగించారు. ఈ సంరద్భంగా మంత్రి ఇంటిని విద్యుత్ దీపాలతో అలకరించారు. రామ జ్యోతి వెలిగించిన సమయంలో తీసిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి.. ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించండని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రామయ్య ప్రాణప్రతిష్టకు ముందు రోజు అంటే.. ఆదివారం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సామలేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మట్టి దీపాన్ని ఏర్పాటు చేసే అనంతరం ఆలయాన్ని శుభ్రం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..