Credit Score For Student: ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు క్రెడిట్ స్కోర్.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ..

|

Jan 29, 2021 | 9:37 PM

Credit Score For Student: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన నూతన విద్యా విధానం అమలుకు యూజీసీ శ్రీకారం చుట్టింది.

Credit Score For Student: ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు క్రెడిట్ స్కోర్.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ..
UGC NET 2021 May Exam Postponed
Follow us on

Credit Score For Student: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన నూతన విద్యా విధానం అమలుకు యూజీసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థులకు సంబంధించి అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ) విధానం త్వరలోనే అమల్లోకి రానున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఏబీసీ విధానంలో విద్యార్థి ప్రతిభ ఆధారంగా.. వారి క్లాస్ వర్క్, ట్యుటోరియల్స్ సాధనల ఆధారంగా క్రిడిట్స్ వేస్తారు. విద్యార్థి చదువులో చురుకుగా, నైపుణ్య ప్రదర్శనలో విభిన్నంగా ఉంటే వారి ఖాతాలో ఎక్కువ క్రెడిట్స్ నమోదవుతాయి. ఈ క్రెడిట్ స్కోర్ విధానం విద్యార్థికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే విద్యార్థి ప్రతిభను అంచనా వేయొచ్చన్న యూజీసీ.. సదరు విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యా సంస్థకు మారినప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా.. ఈ విధానం ద్వారా విద్యార్థి ఏవేనీ కారణాల చేత కోర్సును మధ్యలోనే ఆపివేసినప్పటికీ.. కొంతకాలం తరువాత మళ్లీ చేరవచ్చు అని యూజీపీ మార్గదర్శకాల్లో పేర్కొంది.

Also read:

NIGHT SHELTERS: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్లు ఏర్పాటు చేస్తాం… మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి…

Amitabh Bachchan: ‘షూటింగ్‌ అంటే భయమేస్తుంది.. పారిపోవాలనిపిస్తుంది’.. అమితాబ్ ట్వీట్ వైరల్