Uddhav Thackeray writes to PM Modi : కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది.. దయచేసి వెంటనే ఎస్టీఆర్ఎఫ్ తొలి విడత నిధులను విడుదల చేయండి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అటు, స్టార్ట్ అప్ ల ఈఎంఐలకు వడ్డీ లేకుండా చూడండి అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కరోనా దెబ్బకు మహారాష్ట్ర విలవిల్లాడిపోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ లోనే మహారాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు, సెకండ్ వేవ్ లోనూ కరోనా కేసులు ఆ రాష్ట్రంలో అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సాయం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధానిని అభ్యర్థించారు. రెండో దఫా కరోనా విపత్తును ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలని కూడా థాకరే లేఖలో కోరారు. వైపరీత్యంగా ప్రకటిస్తే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి కరోనా బాధితుల కోసం నిధులను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జీఎస్టీ రిటర్నులు చేయడానికి మూడు నెలల వెసులుబాటును కల్పించాలని.. మార్చి, ఏప్రిల్ నెలల జీఎస్టీ రిటర్నుల గడువును మరో మూడు నెలలు పెంచాలన్నారు. ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీలు వసూలు చేయకుండా చూడాలని కూడా సీఎం థాకరే తన లేఖలో స్పష్టం చేశారు.
Read also : Visakha murders : అప్పలరాజు కుటుంబంపై బాధిత బంధువుల ఆగ్రహావేశాలు, ఆరు హత్యల వెనుక కారణాలు..