
UAN Activation: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం ఇకపై ఏ రంగంలో పనిచేసే ఉద్యోగికైనా ఈపీఎఫ్ సౌకర్యం ప్రతీ కంపెనీ తప్పనిసరిగా కల్పించాలనే నిబంధన విధించింది. గిగ్ వర్కర్కకు కూడా పీఎఫ్ బెనిఫిట్ ఉండాలని రూల్స్ తీసుకొచ్చింది. దీంతో పాటు ఉద్యోగులు సులువుగా ఈపీఎఫ్ సేవలు వినియోగించుకునేలా ఎంప్లాయిూస్ ప్రావిడెట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఎప్పటికప్పుడు నూతన మార్పులు తీసుకొస్తుంది. విత్ డ్రా లిమిట్స్‌ను సవరించడంతో పాటు ఏటీఎం వంటి సేవలు త్వరలో తీసుకురానుంది. అంతేకాకుండా త్వరలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లను కూడా పెంచనుందని సమాచారం.
ఈ క్రమంలో ఈఫీఎఫ్‌వో సంస్థ నుంచి బిగ్ అలర్ట్ ఒకటి వచ్చింది. అదేంటంటే.. ఈపీఎఫ్ సర్వీసులు పొందాలంటే తప్పనిసరిగా యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలని సూచించింది. ఇది యాక్టివేషన్ చేసుకుంటేనే ఈపీఎఫ్ వెబ్‌సైట్లో అన్ని సేవలు లభిస్తాయని స్పష్టం చేసింది. యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోకుండా ఆన్‌లైన్‌లో ఎలాంటి సేవలు పొందలేని తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో పాటు ఎలా యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేసుకోవాలనే వివరాలను కూడా క్లియర్‌గా స్టెప్ పై స్టెప్ ఒక వీడియో రూపంలో విడుదల చేసింది.
యూఏఎన్ అంటే యూనివర్శల్ అకౌంట్ నెంబర్ అని అర్ధం. ఇది 12 అంకెలు కలిగి ఉంది. మీరు ఉద్యోగంలో కొత్తగా చేరేటప్పుడు కంపెనీలు మీకు యూఏఎన్ నెంబర్ అందిస్తాయి. మీ శాలరీ స్లిప్‌లో యూఏఎన్ నెంబర్ కనబడుతుంది. ఈ నెంబర్‌ను యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ సేవలు పొందవచ్చు
-ఈఫీఎఫ్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి.
-మెయిన్ ట్యాబ్‌లో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-మీ యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వివరాలు ఇవ్వాలి
-గెట్ పిన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
-ఆ తర్వాత మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్ అవుతుంది
UAN activation is required to avail of #EPF services. Follow these 6 easy steps to activate UAN.#EPFOwithYou #EPFO #HumHainNa #ईपीएफ@mansukhmandviya @ShobhaBJP @PIB_India @MIB_India @narendramodi @LabourMinistry @PMOIndia @mygovindia pic.twitter.com/MMq7o89eC1
— EPFO (@officialepfo) December 11, 2025