డ్రగ్స్ కేసులో ఇద్దరు కన్నడ నటీనటులకు సమన్లు జారీ

డ్రగ్స్ కేసులో 'కన్నడ నాట' నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన దర్యాప్తు దూకుడును పెంచింది.  ఈ కేసుకు సంబంధించి ఇంద్రిత రే, దిగంత్ అనే నటీనటులకు సమన్లు పంపినట్టు పోలీసులు తెలిపారు. వీరు రేపు తమ ముందు హాజరు కావాలని..

డ్రగ్స్ కేసులో ఇద్దరు కన్నడ నటీనటులకు సమన్లు జారీ

Edited By:

Updated on: Sep 15, 2020 | 6:45 PM

డ్రగ్స్ కేసులో ‘కన్నడ నాట’ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన దర్యాప్తు దూకుడును పెంచింది.  ఈ కేసుకు సంబంధించి ఇంద్రిత రే, దిగంత్ అనే నటీనటులకు సమన్లు పంపినట్టు పోలీసులు తెలిపారు. వీరు రేపు తమ ముందు హాజరు కావాలని  ఈ సమన్లలో కోరామనన్నారు. దివంగత మాజీమంత్రి  జీవరాజ్ ఆల్వా భార్య నందిని ఆల్వా పేరిట బెంగుళూరులోని హెబ్బల్ లేక్ వద్ద ఐదెకరాల స్థలంలో గల రిసార్ట్, హోటల్ పై మంగళవారం పోలీసులు  దాడి చేశారు. కొన్ని గంటలపాటు సోదాలు నిర్వహించారు.డ్రగ్స్ కేసులో మరో నిందితుడైన ఆదిత్య ఆల్వా ను ఇంకా అరెస్టు చేయవలసి ఉందని పోలీసులు చెప్పారు. ఈ రిసార్టును మూసివేశారని, ట్రేడ్ లైసెన్స్ ను రెన్యూ చేయకపోయినా ఇంకా అనధికారికంగా ఈ రిసార్టును వినియోగిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారెవరినీ వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us