బీజేపీ సోషల్ మీడియా వింగ్‌పై దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతుందంటూ లీడర్లు భగ్గమంటున్నారు. బీజేపీని ఫేక్ పార్టీ అంటూ విపక్ష నేతలు కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు అనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ట్విటర్.. బీజేపీ సోషల్ మీడియా వింగ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై లాఠీ చార్జికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేర్ చేసిన వీడియో పచ్చి అబద్ధం అంటూ తేల్చి చెప్పింది. ఆయన చేసిన పోస్టు తప్పుదోవ పట్టించే పోస్టు అంటూ ట్విటర్ ఫ్లాగ్ చేసింది. ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ‘ఏఎల్‌టి న్యూస్’ రైతుల ఆందోళనపై పూర్తిస్థాయి వాస్తవ వీడియోను ఉంచింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసిన వైనం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే, ట్విటర్ రెస్పాండ్స్‌తో బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఒక్కసారిగా ఖంగుతిన్నది. మరోవైపు ట్విటర్ ఫ్లాగ్ చేసిన నేపథ్యంలో బీజేపీ తీరుపై నెటిజన్లు భగ్గమంటున్నారు. భారత్‌లో తొలిసారిగా ఒక ట్వీట్‌ను ఫేక్ న్యూస్ అంటూ ట్విటర్ ఫ్లాగ్ చేసిన ఘనత ఈ వార్తకే దక్కిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్‌కి కేరాఫ్ బీజేపీ అంటూ మరికొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్రంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుల ఉద్యమం సందర్భంగా కొందరు పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. దానికి సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ.. ‘ప్రచారానికి-వాస్తవానికి’ తేడా ఇదీ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, ఇప్పుడా వీడియోనే అవాస్తవం అని ట్విటర్ షాక్ ఇవ్వడంతో బీజేపీ నేతలు షేక్ అవుతున్నారు.
Twitter India is finally exposing the fake news and lies spread by BJP IT Cell. They are marking tweets as manipulated media, just like they did with Donald Trump
Amazing job Twitter, thank you! ? pic.twitter.com/uksBO9F7gW
— Dhruv Rathee ?? (@dhruv_rathee) December 2, 2020