Shashi Tharoor: కేంద్ర మంత్రి తర్వాత.. శశ థరూర్‌కు ట్విట్టర్ ఝలక్.. మూర్ఖత్వం అంటూ మండిపడిన ఎంపీ

|

Jun 26, 2021 | 6:12 AM

Shashi Tharoor on Twitter : కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం అమలుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే.. ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్

Shashi Tharoor: కేంద్ర మంత్రి తర్వాత.. శశ థరూర్‌కు ట్విట్టర్ ఝలక్.. మూర్ఖత్వం అంటూ మండిపడిన ఎంపీ
Shashi Tharoor
Follow us on

Shashi Tharoor on Twitter : కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం అమలుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే.. ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ ప్రముఖులకు తన తఢాఖా ఝలక్ ఇస్తోంది. మైగ్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ .. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే విపక్ష కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా నిలిపి వేసింది. అది కూడా రెండు సార్లు నిలిపివేసిందని శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ.. ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా అంటూ ట్విట్టర్‌కు హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది అంటూ శశి థరూర్ వ్యాఖ్యానించారు.

Also Read:

Arvind Kejriwal: 2 కోట్ల మంది ప్రాణాలు కాపాడటం నేరమా..? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

Gold Price Today: దిగివస్తున్న పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?