దేశ రాజధానిలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్.. మూడోసారి ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

TV9 Network WITT Summit 2026: దేశ ప్రపంచ గురువుగా ఎలా ఎదగబోతోంది? 2047 నాటికి మన ఆర్థిక, ఇంధన, పర్యావరణ లక్ష్యాలు ఏంటి? వీటన్నింటికీ దిశానిర్దేశం చేసేందుకు టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026 సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ మేధోమథనంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే కీలక ఉపన్యాసం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

దేశ రాజధానిలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్.. మూడోసారి ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
Tv9 Network Witt Summit 2026

Updated on: Mar 22, 2026 | 10:08 PM

భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు సోమవారం నుండి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. భారతదేశం – ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలవనుంది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు. టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక సమ్మిట్‌లో ఆయన పాల్గొనడం ఇది వరుసగా మూడవసారి. ప్రధానితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల హేమాహేమీలు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రపంచ వేదికపై మారుతున్న దేశ పాత్ర, భవిష్యత్ లక్ష్యాలపై ప్రధాని ఇచ్చే సందేశం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

వ్యాపార విలువలు – లాభదాయకతపై చర్చ

నేటి వ్యవస్థాపక ప్రపంచంలో విలువలు, ఫైనాన్షియల్ వాల్యూయేషన్ మధ్య ఉన్న సమతుల్యతపై విలువలు వర్సెస్ వాల్యూయేషన్ అనే అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. నేటి స్టార్టప్ ప్రపంచంలో కేవలం లాభాలే కాకుండా నైతిక విలువల ప్రాముఖ్యతపై TiE ఢిల్లీ NCR డైరెక్టర్ ఉపాసన శర్మ, క్యాపిట్ వ్యవస్థాపకురాలు అర్బానా షాహి, స్కై ఎయిర్ మొబిలిటీ సీఈఓ అంకిత్ కుమార్, ఫండమెంటల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ కుమార్ పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఇంధన రంగం – దేశ పరిష్కారాలు

ఇండియాస్ వే అవుట్ అనే అంశంపై ప్రపంచ ఇంధన సవాళ్లు, భారత్ చూపుతున్న గ్రీన్ ఎనర్జీ పరిష్కారాలపై TERI డైరెక్టర్ జనరల్ డాక్టర్ విభా ధావన్ వంటి మేధావులు విశ్లేషిస్తారు. అదనంగా ‘ది గ్రీన్ పివట్, ది సస్టైనబిలిటీ ఇంపరేటివ్ వంటి సెషన్ల ద్వారా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై భారతదేశ బాధ్యతను చర్చించనున్నారు.

ఈ సదస్సు కేవలం చర్చల వేదిక మాత్రమే కాదు, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించే ఒక కీలక ప్రయత్నం. వ్యాపార వృద్ధిని, ప్రపంచ బాధ్యతను అనుసంధానిస్తూ భారతదేశం ప్రపంచ స్థాయికి ఎలా ఎదగబోతోందో ఈ WITT 2026 సమ్మిట్ దిశానిర్దేశం చేయనుంది.

Follow Us